Rowdy Sheeter Riyaz: ఆస్పత్రిలో రౌడీ షీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్

నిజామాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నరౌడీ షీటర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కానిస్టేబుల్ ప్రమోద్ చావుకు కారణమైన రియాజ్‌ను నిజామాబాద్ పోలీసులు ఆదివారం గాయాలతో అదుపులోకి తీసుకున్నారు. ఓ యువకుడితో ఘర్షణలో రియాజ్ తీవ్రంగా గాయపడ్డాడు.

New Update
Rowdy sheeter Riyaz

నిజామాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నరౌడీ షీటర్‌ని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. చిక్సిత పొందుతూ రియాజ్ హాస్పిటల్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని పోలీసులపై కాల్పులు చేయడానికి ప్రయత్నించాడు రౌడీ షీటర్ రియాజ్. సెక్యూరిటీగా ఉన్న ఏఆర్  కానిస్టేబుల్ తీవ్రగాయాలైయ్యాయి. కానిస్టేబుల్ హత్య కేసులో రియాజ్ నిందితుడిగా ఉన్నాడు. రెండు రోజుల క్రితం CCS కానిస్టేబుల్ ప్రమోద్‌ని రియాజ్ కత్తితో పొడిచి పారిపోయారు. 

కొన్ని రోజుల క్రితం నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్ చావుకు కారణమైన రియాజ్‌ను పోలీసులు ఆదివారం గాయాలతో అదుపులోకి తీసుకున్నారు. ఓ యువకుడితో ఘర్షణలో రియాజ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని అరెస్ట్ చేసి.. హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. బీబీహెచ్‌లో చికిత్స పొందుతూ తప్పించుకోడానికి ప్రయత్నించాడు.  నిన్న రౌడీ షీటర్ రియాజ్‌ పోలీసుల కాల్పుల్లో చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. దీంతో సీపీ స్పందించి రియాజ్ చనిపోలేదని ప్రకటించారు. మరో వ్యక్తితో జరిగిన ఘర్షణలో రియాజ్ తీవ్రంగా గాయపడ్డాడని ఆయన తెలిపారు. చికిత్స నిమిత్తం రౌడీ షీటర్ రియాజ్‌ను హాస్పిటల్‌కు తరలించారు. హాస్పిటల్‌లో సోమవారం ఉదయం పోలీసుల నుంచి అతడు తప్పించుకోడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు అతనిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కాపాలాగా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని ఫైరింగ్ చేయబోయాడు రియాజ్.

Also Read :  తెలంగాణ, ఏపీలో కొత్త వైరస్ కలకలం.. ఒల్లంతా బొబ్బలు.. భయం భయం!

Rowdy Sheeter Riyaz Died

Also Read :  దీపావళి విశిష్టత ఏంటి? ఈ పండుగ వేళ దీపాలను ఎందుకు వెలిగిస్తారంటే..!

Advertisment
తాజా కథనాలు