Harish Rao : రేవంత్ రెడ్డి బావమరిది బాగోతం బయటపడుతుందనే కుట్ర

బొగ్గు కుంభకోణం కేసులో రేవంత్ రెడ్డి బావమరిది బాగోతం బయటపడుతుందని.. దీని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇవాళ విచారణ పేరుతో హడావిడి చేశారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో విచారణ అనంతరం ఆయన మాట్లాడారు.

New Update
Harish Rao

Harish Rao

Harish Rao : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు  సిట్‌ విచారణ ముగిసింది. జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లో దాదాపు ఏడు గంటలపాటు అధికారులు ఆయనను ప్రశ్నించారు. ఏసీపీ వెంకటగిరి, ఎస్పీ రవీందర్‌రెడ్డి విచారణలో పాల్గొన్నారు. సిట్‌ విచారణ అనంతరం హరీశ్‌రావు తెలంగాణ భవన్‌కు చేరుకుని మీడియాతో మాట్లాడారు. బొగ్గు కుంభకోణం కేసులో రేవంత్ రెడ్డి బావమరిది బాగోతం బయటపడుతుందని.. దీని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇవాళ విచారణ పేరుతో హడావిడి చేశారని ఆయన విమర్శించారు.

ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తిని. నిఖార్సైన ఉద్యమకారుడిని. ఇలాంటి విచారణలకు భయపడను. ఉద్యమంలో ఎన్నో కేసులు, బెదిరింపులు, అరెస్టులు ఎదుర్కొన్నాను. ఈ విచారణలకు ఓ లెక్క కాదు.. ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వస్తాను. అంటూ హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఏది అడిగినా నిజాయితీగా సమాధానాలు ఇస్తానన్నారు. ఇవాళ తనను ముగ్గురు అధికారులు విచారించారని తెలిపారు. తమకు చట్టంపై గౌరవం ఉందని.. అందుకే పోలీసులు ఇచ్చిన నోటీసులను స్వీకరించి వెంటనే విచారణకు హాజరయ్యానన్నారు. మాకు కేసీఆర్ ధైర్యంతో బతకడం నేర్పించారన్నారు. రేవంత్ రెడ్డి నిజాయతీపరుడే అయితే బొగ్గు కుంభకోణం కేసులో సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

కాంగ్రెస్‌ కుంభకోణాల మయం

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాలకు మయంగా మారిందని హరీశ్‌రావు ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను గంగలో కలిపారని ఎద్దేవా చేశారు. దండుపాళ్యం ముఠాలా కాంగ్రెస్‌ ప్రభుత్వం దోచుకుంటోంది.  రాష్ట్రంలో ఎక్కడికక్కడ ప్రజలు మంత్రులను నిలదీస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ సర్కార్‌ స్కామ్‌లపై ఎక్కడైనా చర్చకు సిద్ధం. ‘సీఎం రేవంత్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదర్కోవాలని.. సిట్‌లు.. గిట్‌లు అంటూ విచారణల పేరుతో విపక్షాలను వేధించే ప్రయత్నం చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. నీ పతనాన్ని నువ్వే వేగవంతం చేసుకుంటున్నావ్’ ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. అని హరీష్ రావు ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని హరీష్ రావు మరోసారి ధీమా వ్యక్తం చేశారు.

‘‘ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిరాధార ఆరోపణలు చేశారని హరీశ్‌రావు అన్నారు. రేవంత్‌రెడ్డి బావమరిదే రూ.వేల కోట్ల కుంభకోణానికి తెరలేపారు. బొగ్గుస్కామ్‌పై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి. రేవంత్‌రెడ్డి నిజాయతీపరుడైతే సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి. సిట్టింగ్‌ జడ్జికి అన్ని ఆధారాలు అందిస్తామన్నారు. మంత్రుల మధ్య వాటాల పంపకం రోడ్డు మీదకు వచ్చింది. మంత్రుల బాగోతం నుంచి దృష్టి మళ్లించేందుకు నాపై విచారణ చేపట్టారని ఆరోపించారు. ఏదో ఒక కేసులో నన్ను ఇరికించాలని సీఎం ప్రయత్నిస్తున్నారు. చట్టాలను గౌరవిస్తా.. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా హాజరవుతా’’ అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.ఇవాళ్టి విచారణపై మీడియాకు ప్రభుత్వం లీక్‌లు ఇచ్చే అవకాశం ఉంది. ధైర్యం ఉంటే నా విచారణ వీడియో మొత్తం బయటపెట్టాలి అని హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు.

Advertisment
తాజా కథనాలు