KTR టార్గెట్‌గా రేవంత్‌ బిగ్‌ స్కెచ్‌..?

ఫార్ములా-ఈ కార్ల రేసింగ్‌ అంశంలో కేటీఆర్ చుట్టూ ఉచ్చుబిగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే రూ.55 కోట్లు చెల్లించారనే ఆరోపణలపై కేటీఆర్‌ అరెస్టుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

Formula E-Car Race
New Update

ఫార్ములా - ఈ కార్ల రేసింగ్‌ అంశంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ చుట్టూ ఉచ్చుబిగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ-కార్ల రేసింగ్ నిర్వహణ సంస్థ ఫార్ములా-ఈ ఆపరేషన్స్‌ (FEO)కు కేటీఆర్‌ మౌఖిక ఆదేశాల మేరకు అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే రూ.55 కోట్లు చెల్లించారన్న అంశాన్ని ఆధారంగా చేసుకుని.. కేటీఆర్‌ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. 

ఇది కూడా చదవండి: ఆమె వీడియో చూడగానే ఏడ్చేసిన సూర్య.. ప్రోమో వైరల్

దీనికి ఇటీవల జరిగిన సంఘటనలే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజకీయ బాంబులు పేలబోతున్నాయంటూ కామెంట్లు చేయడం హాట్ టాపిక్‌గా మారిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ రాజకీయ బాంబు ఏంటా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీపావళి సందర్భంగా ఆ బాంబు పేల్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ అలా ఏం జరగలేదు.

ఇది కూడా చదవండి: ఆమె కాదు అతడే.. స్వర్ణ పతకం వెనక్కి తీసుకోండి: హర్భజన్‌

దీంతోపాటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అర్వింద్‌ కుమార్‌కు తాజాగా ఏసీబీ నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగే కేటీఆర్‌ బావమరిది రాజ్ పాకాల జన్వాడ నివాసంలో దాడులు.. వీటికి తోడు సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల కేటీఆర్‌ లక్ష్యంగా చేసిన కామెంట్లు వంటి పరిణామాలన్నీ కేటీఆర్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తున్న సంకేతాలే అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

ఇది కూడా చదవండి: అమెరికా ఎన్నికలు.. ఎగ్జిట్ పోల్ సర్వేల అంచనాలివే!

అర్వింద్‌ కుమార్‌కు నోటీసులు

ఫార్ములా ఈ-రేసు అంశంపై ఏసీబీ విచారణ చేయా­లంటూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్‌ లేఖ రాయగా.. ఆ లేఖపై స్పందించిన ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారి ఆధ్వర్యంలోని అధికారులు రంగంలోకి దిగి ఫార్ములా-ఈ రేసు అంశాన్ని బయటకు లాగుతున్నారు. ఇందులో భాగంగానే అర్వింద్‌ కుమార్‌కు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ విచారణలో అర్వింద్‌ కుమార్‌ వెల్లడించే అంశాలే కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది. దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

ఇది కూడా చదవండి: 2050 విజ‌న్‌తో.. ఓరుగల్లు ఎలా మారబోతుందంటే!?

విదేశీ సంస్థకు నిధులు ట్రాన్సఫర్

మరోవైపు ఫార్ములా-ఈ రేసు అంశంలో విదేశీ సంస్థకు నిధులు ట్రాన్సఫర్ అయిన తరుణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED)కు కూడా ప్రభుత్వం సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఇక ఏసీబీ కేసు రిజిస్టర్‌ చేసిన తరుణంలో ఈడీ కూడా విచారణ చేపట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. హైదరాబాద్‌లో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఫార్ములా-ఈ రేసు నిర్వహించారు. దీనికి సంబంధించి ఎఫ్‌ఈవో, ఏస్‌ నెక్ట్స్‌జెన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కలిసి పురపాలక శాఖ 2022 అక్టోబర్‌ 25న త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో మొదటి ఫార్ములా-ఈ కార్ల రేస్‌ (సెషన్‌–9) నిర్వహించారు. అయితే ఈ కార్ల రేసింగ్‌కు దేశవ్యాప్తంగా అభిమానులు వచ్చారు. కానీ ప్రమోటర్‌ ఏస్‌ నెక్ట్స్‌జెన్‌ సంస్థ ఆశించిన మేరకు ఆదాయం సమకూరలేదు. దీంతో ప్రమోటర్‌ పక్కకు తప్పుకున్నారు. 

దీని కారణంగా ఈ ఏడాది (2024) ఫిబ్రవరి 10న నిర్వహించాల్సిన రెండో ఫార్ములా-ఈ కార్ల రేస్‌ (సెషన్‌-10) నుంచి ఎఫ్‌ఈవో హైదరాబాద్‌ పేరును తొలగించింది. కానీ అప్పటి మంత్రి కేటీఆర్‌ ఫార్ములా-ఈ నిర్వహణ హైదరాబాద్‌కు బాగుంటుందని.. 2024 ఫిబ్రవరిలో కూడా హైదరాబాద్‌లోనే కార్‌ రేస్‌ను నిర్వహించాలని కోరారు. అదే సమయంలో ప్రమోటర్‌ నిర్వహించే బాధ్యతలను నోడల్‌ ఏజెన్సీగా హెచ్‌ఎండీఏ చూసుకుంటుందని ఎఫ్‌ఈవోకు క్లారిటీ ఇచ్చారు. 

ఇందులో భాగంగానే రెండో దఫా ఈ-కార్‌ రేస్‌ కోసం 2023 అక్టోబర్‌లో ఎఫ్‌ఈవోతో పురపాలక సంస్థ డీల్ చేసుకుంది. ఈ మేరకు రేస్‌ నిర్వహణ కోసం దాదాపు రూ.100 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇందులో భాగంగానే హెచ్‌ఎండీఏ రూ.55 కోట్లను ఎఫ్‌ఈవోకు చెల్లించింది. ఇక డిసెంబర్‌ 7న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫార్ములా-ఈ రేసుపై ఆరా తీసింది.

పురపాలక శాఖ ఒప్పందంలోని అంశాలను ఉల్లంఘించిందంటూ ఎఫ్‌ఈవో సెషన్‌-10ను రద్దు చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ అనుమతి లేకుండా అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.55 కోట్లను విదేశీ కంపెనీకి హెచ్‌ఎండీఏ ద్వారా ట్రాన్సఫర్ చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో అర్వింద్‌ కుమార్‌ను పురపాలక శాఖ నుంచి ట్రాన్సఫర్ చేసింది. ఇందులో భాగంగానే నిధుల చెల్లింపుల్లో జరిగిన ఉల్లంఘనలపై వివరణ ఇవ్వాలంటూ అర్వింద్‌ కుమార్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మెమో జారీ చేశారు. 

ఆ మెమోకు స్పందించిన అర్వింద్‌ కుమార్‌ తాజాగా వివరణ ఇచ్చారు. తాను ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని పేర్కొన్నారు. అప్పటి మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన మౌఖిక ఆదేశాలతోనే చెల్లింపులు చేశామని అర్వింద్ కుమార్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రభుత్వం అనుమతినిస్తుందని చెప్పడంతోనే ఎఫ్‌ఈవోకు నిధులు రిలీజ్ చేశామని అర్వింద్ కుమార్ వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ తరుణంలోనే ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే పురపాలక శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌కు నోటీసులు జారీ చేసింది.

#ktr #revanth-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe