/rtv/media/media_files/2026/03/01/fotojet-5-2026-03-01-17-38-58.jpg)
Rashmika meets CM Revanth.. invited to the reception
Vijay- Rashmika : హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న గురువారం పెళ్లి(ashmika-Vijay Marriage) చేసుకున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని ఐటీసీ మెమెంటోస్‌లో వీరి పెళ్లి అత్యంత ఘనంగా జరిగింది. ఉదయం తెలుగు సంప్రదాయం ప్రకారం.. సాయంత్రం కొడవ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవడం విశేషం. అయితే ఈ పెళ్లికి అతి కొద్ది మంది బంధుమిత్రులను, స్నేహితులను మాత్రమే ఆహ్వానించారు. శుక్రవారం ఈ జంట హైదరాబాద్ తిరిగివచ్చింది. కాగా మార్చి 4 న హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించబోతున్నారు. వారి రిసెప్షన్‌కు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించారు.
#Virosh distributing love ❤️🫶#RashmikaMandanna#VijayDeverakondapic.twitter.com/LyuL16u6aB
— Rashmika Delhi Fans (@Rashmikadelhifc) March 1, 2026
Also Read : హిట్ ట్రాక్ ఎక్కిన సంతోష్ శోభన్.. వరుస ప్రాజెక్టులతో ఫుల్ జోష్!
సీఎం దంపతులను కలిసిన రష్మిక
కాగా ఆదివారం రష్మిక మందన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(cm-revanthreddy) ని ఆయన నివాసంలో కలిశారు. 4న నిర్వహించే తమ రిసెప్షన్(reception) కు రావాలని ముఖ్యమంత్రిని ఆమె ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం సతీమణి రష్మికకు తెలంగాణ సంప్రదాయం ప్రకారం బొట్టుపెట్టి కొత్త బట్టలను అందజేసింది.
Also Read : అమ్మకి పెళ్లి చేస్తా.. ఆమె సంతోషమే నాకు ముఖ్యం: సుప్రీత
ప్రధాని మోదీకి ఆహ్మానం
హైదరాబాద్ లో మార్చి 4న జరగనున్న తమ రిసెప్షన్‌కు రావాలని విజయ్, రష్మిక((Vijay Devarakonda - Rashmika)) లు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ని కలిశారు. ఈ సందర్భంగా రిసెప్షన్‌కు రావాలని ప్రధానికి ప్రత్యేక ఆహ్వానం అందించారు. ప్రధానితో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కూడా ఈ జంట కలిశారు. పెళ్లి రిసెప్షన్‌కు రావాలని అహ్వానించారు. ఈ సందర్భంగా ఇన్విటేషన్‌తో పాటు వినాయకుడి విగ్రహాన్ని కూడా వారికి అందించారు.
టీటీడీ టెంపుల్ లో సందడి
కాగా ఆదివారం నూతన దంపతులు విజయ్ దేవరకొండ, - రష్మిక హైదరాబాద్‌లోని టీటీడీ ఆలయాన్ని సందర్శించారు. శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుని వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం భక్తులు, అభిమానులకు స్వీట్ బాక్సులను అందజేశారు. దీనికి సంబంధిత వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Follow Us