/rtv/media/media_files/2025/02/11/d4XfPgkJYAPbCgKM2jWc.jpg)
Ramarajyam Raghavareddy
Ramarajyam Raghav Reddy: చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి చేసిన రామరాజ్యం వీరరాఘవరెడ్డి తరువాతి టార్గెట్ చిన్నజీయర్ స్వామినా? అంటే అవుననే అంటున్నాయి రాఘవరెడ్డి గతంలో చేసిన వీడియోలు. గోత్రాలను సంకరం చేస్తారా చిన్నజీయర్ అంటూ వీర రాఘవరెడ్డి చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. వాటితో పాటు రామరాజ్యం స్థాపించాలంటే ఒక్కొక్క ఊరు నుంచి కనీసం ఒక్కొక్క సైనికుడు తనతో కలిసి వస్తే చాలంటూ చేసిన వీడియోలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. చిలుకూరు బాలాజీ ఆలయానికి కొచ్చే వాళ్ళ నుంచి "రామరాజ్యం" సంస్థకు సైనికులు వచ్చేలా తనకు సహకరించాలని, ఆలయ భూములను ఆలయాన్ని తమకు అప్పజెప్పాలంటూ రంగరాజన్ పై దాడి చేశారనేది రామరాజ్యం వ్యవస్థాపకుడు వీర రాఘవ రెడ్డిపై ఆరోపణ.దీంతో ఆయనతో పాటు మరికొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది కూడా చూడండి: Telangana Beers : పెరిగిన బీర్ల ధరలు.. లైట్, స్ట్రాంగ్ ఎంత? .. ప్రభుత్వానికి ఎంత ఆదాయం ?
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా "అనపర్తి " ప్రాంతానికి చెందిన వీర రాఘవరెడ్డి పై గతంలోనూ పలు కేసులున్నాయి. తాజాగా రంగరాజన్ పై దాడితో ఒక్కసారిగా జనానికి తెలిసిన వీర రాఘవరెడ్డి గతంలో చేసిన వీడియోలన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాటిలో చిన్న జీయర్ స్వామిని కూడా టార్గెట్ చేస్తూ వీరరాఘవ రెడ్డి మాట్లాడిన వీడియో ఇప్పుడు తెరపైకి వచ్చింది." గోత్రాలను సంకరం చేస్తారా చిన్న జీయర్ "అంటూ వీర రాఘవరెడ్డి చేసిన వీడియోపై ఇప్పుడు పెద్ధ చర్చ సాగుతోంది.
ఇది కూడా చూడండి: Maha Kumbh mela: మహా కుంభమేళాకు భారీగా తరలి వచ్చిన భక్తులు...కాశీలోనే ఆంక్షలు విధించిన అధికారులు!
గోత్రాలు మారుస్తున్నాడని..
అతిపెద్ద రామానుజ స్వామి విగ్రహాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసిన చిన్న జీయర్ వేర్వేరు గోత్రాలను కలిపేస్తున్నారని వీర రాఘవరెడ్డి ఆరోపించాడు. తన దగ్గరకు వచ్చే వారిని రామానుజ గోత్రీకులుగా చిన్న జీయర్ పిలుస్తారని దానివల్ల గోత్రాలన్నీ మారిపోతున్నాయంటూ రాఘవ రెడ్డి వీడియో చేశారు. మహిపాల గోత్రానికి చెందిన తాము వివాహాలు చేసుకోవడానికి కొన్ని ప్రత్యేక గోత్రాలు ఉన్నాయని అలాంటిది చిన్న జీయర్ గోత్రాలన్నీ కలిపేస్తే ఎలా? దానివల్ల అందరూ ఒకే గోత్రానికి చెందినవారవుతారని రాఘవరెడ్డి వీడియోలో ఆరోపించారు. మూడు నెలల క్రితం చేసినట్టున్న ఈ వీడియో ఇప్పుడు తాజా వివాదం నేపథ్యంలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసినవారంతా చిన్న జీయర్ స్వామిని కూడా రాఘవరెడ్డి టార్గెట్ చేశారని నెటిజెన్స్ చర్చించుకుంటున్నారు. ఒకవేళ రంగరాజన్ విషయం వెలుగులోకి రాకపోతే చిన్నజీయర్ స్వామిని టార్గెట్ చేసేవాడేమోనని చర్చ సాగుతోంది.
Also read : ఆ కోతి చేసిన పనికి 11 గంటలు కరెంట్ కట్.. ఆ మంకీ ఏం చేసిందో తెలుసా?
కాగా రంగరాజన్ పై దాడి నేపథ్యంలో చిన్నజీయర్ స్వామి కూడా స్పందించారు.రామ రాజ్యం సాధించడం పెద్ద కష్టమేమి కాదని, అందరూ తలుచుకుంటే సులభమే అని ఆయన అన్నారు. అయితే ఇలా హింసాత్మక ధోరణులతో సాధించేది రామరాజ్యం కాదని ఆయన హితవు పలికారు. రాజ్యంగ బద్ధంగా మాత్రమే రామరాజ్యం స్థాపన సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
ఇది కూడా చూడండి: Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం పై మగువ...బీజేపీ పెద్ద ప్లానే...నలుగురు ఎమ్మెల్యేలకు అవకాశం...!
ఆలయ భూములే టార్గెట్
ఇక రామరాజ్యం స్థాపిస్తానంటూ వీర రాఘవరెడ్డి గత కొంత కాలంగా ప్రత్యేక సైన్యాన్ని తయారు చేస్తున్నాడన్న ఆరోపణలున్నాయి. హిందూ మతాన్ని విశ్వసించేవారిని టార్గెట్ చేస్తూ వీడియోలు చేస్తున్నాడు. ఏపీ తెలంగాణలో కలిపి 27,800 గ్రామాలు ఉన్నాయని ఒక్కొక్క ఊరు నుంచి కనీసం ఒక్కొక్క సైనికుడు తనతో కలిసి వచ్చినా రామరాజ్య స్థాపన సాధ్యమేనంటూ వీర రాఘవరెడ్డి గత కొంతకాలంగా ప్రచారం చేస్తున్నాడు. ఆ కోణంలోనే రూపొందించిన పలు వీడియోలను కూడా తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశాడు. రాఘవరెడ్డి ప్రసంగాలను పరిశీలించిన వారంతా ఆలయాల పేరుతో ఉన్న భూముల పై కన్నేసి, వాటిని స్వాధీనం చేసుకోవాలనే ఉద్ధేశంతోనే ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తున్నారు.
Also read : ఆ కోతి చేసిన పనికి 11 గంటలు కరెంట్ కట్.. ఆ మంకీ ఏం చేసిందో తెలుసా?