Telangana Rains : తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణశాఖ వెల్లడించింది.  నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది.

New Update
rains Telangana

తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణశాఖ వెల్లడించింది.  నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.  నేడు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణ్ పేట్, మహబూబ్‌నగర్‌, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇంకా గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది.  

ఎల్లో అలర్ట్స్ జారీ

ఇక రేపు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణ్ పేట్, మహబూబ్‌నగర్‌, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.  ఈ మేరకు ఆయా ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది వాతావరణ శాఖ.  

రాష్ట్రంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురువనుండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.  వర్షం కురుస్తున్నపుడు చెట్ల కింద ఉండకూడదని,  కరెంట్ వైర్ల కింద, రేకుల ఇళ్ళల్లో ఉండరాదని అధికారులు కీలక సూచనలు చేశారు. ఇక మే 18 నుంచి 20 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. అంతేకాకుండా మే 18 నుంచి 24 వరకు కేరళ, మాహే, కోస్తా కర్ణాటక, ఉత్తర అంతర్గత కర్ణాటకలో వర్షాలు పడే అవకాశం ఉంది. 

 IMD weather report | telangana-rains | heavy-rains 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు