హైదరాబాద్‌లో డ్రగ్స్ దందాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పోలీసులు దీనిపై ఉక్కుపాదం మోపినప్పటికీ ఎక్కడో ఓ చోట ఈ కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. డ్రగ్స్ భూతమే కాకుండా నగరంలో తుపాకుల దందా కూడా జరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఇద్దరు వ్యక్తుల నుంచి పోలీసులు నాటు తుపాకులు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. బీహార్ నుంచి ఇద్దరు వ్యక్తులు 7 నాటు తుపాకులు, 11 బుల్లెట్లను విక్రయించేందుకు హైదరాబాద్‌కు వచ్చారు. దీంతో సమాచారం మేరకు రాచకొండ పోలీసులు రంగంలోకి దిగారు.
Also Read: తండ్రిని చంపి ఇంట్లోనే పాతిపెట్టిన కొడుకులు.. 30 ఏళ్ల తర్వాత ఎలా బయటపడిందంటే?
రెక్కీ నిర్వహించగా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల నుంచి తుపాకులు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు. నగరంలో ఎవరు తుపాకులు కొనేందుకు యత్నించారు ?, ఎక్కడివారు అనే వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు నిందితులను ఆరా తీస్తున్నారు. అయితే పట్టుబడిన ఆ ఇద్దరు కూడా కిరాయి హంతకులే అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.