ప్రపంచ ధ్యాన దినోత్సవం.. ప్రకటించిన ఐరాస

ప్రతీ ఏటా డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించుకునేందుకు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి శాశ్వత ప్రతినిధి హరీష్ పర్వతనేని ఎక్స్ ద్వారా తెలిపారు.

New Update
World meditation day

మారుతున్న జీవనశైలి వల్ల చాలా మంది ఒత్తిడి వంటి మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీని నుంచి విముక్తి పొందడానికి యోగా, మెడిటేషన్ వంటివి తప్పకుండా చేయాలి. ఈ క్రమంలోనే ఐక్యరాజ్య సమితి ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. భారత్‌తో సహా పలు దేశాలు తీర్మానాన్ని ప్రతిపాదించగా.. ప్రతీ ఏటా డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. 

ఇది కూడా చూడండి: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధరలు

డిసెంబర్ 21 చాలా పవిత్రమైన రోజు..

ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి శాశ్వత ప్రతినిధి హరీష్ పర్వతనేని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. సమగ్ర, శ్రేయస్సు, అంతర్గత పరివర్తన కోసం డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని జరుపుకునేందుకు భారత్‌తో పాటు మరికొన్ని దేశాలు ఈ తీర్మానాన్ని తీసుకొచ్చాయి. వీటిని ఐక్యరాజ్య సమితి ఏకగ్రీవంగా ఆమోదించింది. డిసెంబర్ 21 చాలా పవిత్రమైన రోజు అని.. యావత్తు ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్ పాటుపడుతుందన్నారు. వసుదైక కుటుంబం అనే నాగరికత నుంచి భారత్ వచ్చిందని హరీష్ పర్వతనేని అన్నారు.  

ఇది కూడా చూడండి: Farmer suicide: తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య

ఇది కూడా చూడండి: సంధ్య థియేటర్ ఘటనపై ఎట్టకేలకు స్పందించిన బన్నీ.. బాధిత కుటుంబానికి 25 లక్షల సాయం

ఇది కూడా చూడండి:  ఇంటర్నెట్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. తక్కువ ఖరీదుకే కనెక్షన్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు