పొంగులేటి ఇంట్లో సోదాలకు కారణం అదేనా.. ఈడీ సంచలన ప్రకటన తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. పొంగులేటి కొడుకు హర్ష రెడ్డి.. క్రిప్టో, హవాలా మార్గంలో రూ.5 కోట్లు విలువ చేసే వాచ్‌లు కొన్నట్లు బయపడింది. ఈ నేపథ్యంలోనే సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. By B Aravind 27 Sep 2024 | నవీకరించబడింది పై 27 Sep 2024 15:17 IST in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నుంచి జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంట్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అలాగే హిమాయత్‌సాగర్‌లోని పొంగులేటి ఫాంహౌస్, ఆయన కూతురు, బంధువుల ఇళ్లల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన అధాకారుల బృందాలు ఏకకాలంలో 15 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నాయి. కస్టమ్స్ సుంకం ఎగవేత, మనీ లాండరింగ్ కేసుల నేపథ్యంలో ఈడీ దాడులు జరగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు.. షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్, రాఘవా కన్స్ట్రక్షన్స్ మధ్య సంబంధాలపై ఈడీ ఆరా తీస్తోంది. అలాగే యూరో ఎగ్జిమ్ బ్యాంక్ నుండి తీసుకున్న ఫేక్ గ్యారెంటీలపై కూడా అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం. Also Read: వాగులో వెంచర్.. శిల్పాకు అధికారుల ఝలక్! ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఈడీ అధికారులు పొంగులేటి నివాసంలో సోదాలు నిర్వహించారు. మళ్లీ ఇప్పుడు సోదాలు జరగడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. ఇటీవల వాచీల స్మగ్లింగ్ కేసులో పొంగులేటి కొడుకు హర్ష రెడ్డి నివాసంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. అయితే తాజాగా ఈడీ అధికారులు నుంచి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. హర్ష రెడ్డి.. క్రిప్టో, హవాలా మార్గంలో రూ.5 కోట్లు విలువ చేసే వాచ్‌లు కొన్నట్లు తేలింది. నవిన్ కుమార్ అనే వ్యక్తి ద్వారా రూ.100 కోట్లకు పైగా స్మగ్లింగ్ జరుగుతోందని బయటపడింది. ఇక ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది ఫిబ్రవరి 5న చెన్నై ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు రెండు అత్యంత ఖరీదైన వాచీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వాచీలను మహమ్మద్ ఫహెర్దీన్ ముబీన్ అనే వ్యక్తి హాంకాంగ్ నుంచి సింగపూర్ మీదుగా భారత్‌లోకి తీసుకొచ్చినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. దీంతో ఆ వాచీలను తీసుకువచ్చిన ముబీన్‌ను అరెస్టు చేసి విచారణ చేపట్టగా నవీన్ కుమార్ అనే వ్యక్తి కోసం తీసుకువచ్చినట్లు చెప్పాడు. నవీన్ కుమార్‌ను విచారించగా.. అతను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్ష రెడ్డి పేరు చెప్పాడు. హవాలా మార్గంలో ఈ వాచీలకు డబ్బులు చెల్లించినట్లు కస్టమ్స్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే గతంలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించింది. #telugu-news #telangana #ponguleti-srinivas మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి