Telangana: మళ్లీ సెప్టెంబర్‌ 17 వివాదం.. పోటాపోటీగా వేడుకలు

సెప్టెంబర్ 17ను రేవంత్ ప్రభుత్వం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పేరిట నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో వేడుకలు నిర్వహించనుంది. మరోవైపు కేంద్రం వరుసగా మూడోసారి తెలంగాణ విమోచన దినోత్సవంగా కార్యక్రమం జరపనుంది.

Nijam
New Update

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటిసారిగా సెప్టెంబర్ 17 కార్యక్రమం జరగనుంది. దీంతో రేవంత్ సర్కార్‌ ఈ వేడుకను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పేరిట నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, సాంస్కృతికశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తోపాటు రాష్ట్ర బీజేపీ నేతలు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ను కూడా సీఎం రేవంత్ ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. 

మరోవైపు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 17ను వరుసగా మూడోసారి కూడా తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తోంది. పరేడ్ గ్రౌండ్‌ వేదికగా ఈ వేడుకలు నిర్వహించనుంది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకవాత్, కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. అంతేకాదు ఈ వేడుకలకు సీఎం రేవంత్‌ రెడ్డిని కూడా ఆహ్వానించామని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్ తెలిపారు.

Also Read: జానీ మాస్టర్‌ ఎక్కడా? బాధితురాలికి వైద్య పరీక్షలు!

రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 17ను అత్యంత ప్రాధాన్యం కలిగిన రోజుగా గుర్తించి వేడుకను జరపడం సంతోషమేనని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కానీ కేంద్రం నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవం పేరు మార్చడం సరికాదన్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ” ప్రతిపాదిత ప్రజాపాలన దినోత్సవం వేడుకకు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. కానీ నిజాం ప్రైవేటు సైన్యమైన రజాకార్ల కిరాతక పాలన నుంచి హైదరాబాద్‌ ప్రాంతం స్వాతంత్ర్యం పొందేందుకు ఏళ్ల తరబడి పోరాటం జరిగింది. రజాకార్ల హింసల వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ గడ్డపై పుట్టిన బిడ్డగా మీకు కూడా ఈ విషయం తెలుసు.

వాళ్లందరి పోరాటాన్ని, త్యాగాలను స్మరించుకుంటూ.. ప్రస్తుత తరానికి వారి సాహసాలను తెలియజేసి జాతీయ భావనను కల్పించాలి. వేలాది మంది త్యాగాల వల్ల నిజాం పాలన నుంచి హైదరాబాద్‌ విముక్తి పొందగా.. దీనికి విమోచన దినోత్సవం అని కేంద్రం పేరు పెడితే దాన్ని మార్చడం సరికాదు. ఇది ప్రజల దృష్టిని మరల్చడమే అవుతుంది. తెలంగాణ చరిత్రను ప్రజల నుంచి దూరం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నంలో తాను భాగస్వామ్యం కాలేనని” కిషన్‌ రెడ్డి లేఖలో తెలిపారు.

Also Read: ఓ దిక్కుమాలినోడ.. విగ్రహం టచ్ చేస్తే ఫామ్ హౌస్‌ల్లో జిల్లెడు మోలిపిస్తా!

#telangana #cm-revanth #bjp
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe