BRS: బీఆర్ఎస్‌కు షాక్.. ఆ సభ డౌటే....?

బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు గడచిన సందర్భాన్ని పురష్కరించుకుని వరంగల్ లో రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ రంగం సిద్ధంచేస్తున్నారు. అయితే వరంగల్ సభపై బిగ్ స్విస్ట్ నెలకొంది. సభకు పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో సందిగ్ధం నెలకొంది.

New Update
 BRS Silver Jubilee Celebrations

BRS Silver Jubilee Celebrations

BRS Warangal Meeting: బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు గడచిన సందర్భాన్ని పురష్కరించుకుని వరంగల్ లో రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ రంగం సిద్ధంచేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రతిరోజు వివిధ జిల్లాల వారిగా సమావేశాలు నిర్వహిస్తూ కార్యక్రమ నిర్వహణపై దిశానిర్ధేశం చేస్తున్నారు. అయితే వరంగల్ సభపై బిగ్ స్విస్ట్ నెలకొంది. ఈ సభ కోసం వరంగల్ పోలీసుల నుంచి ఇంకా అనుమతి రాకపోవడంతో సందిగ్ధం నెలకొంది.

ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

ముఖ్యంగా వరంగల్ లో సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉండడంతో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అనుమతి ఇస్తారా లేదా అనేది క్లారిటీలేదు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లుగా వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ప్రకటించారు. నేటి నుంచి 30 రోజులపాటు సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉండనుందని ఆయన తెలిపారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో మీటింగులు, ఊరేగింపులను నిషేధిస్తూ వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇది కూడా చూడండి: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

ఈనెల 27వ తేదీన కమిషనరేట్ పరిధిలోని ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ హై కమాండ్ ప్రకటించింది. సభ అనుమతి కోసం పోలీస్ శాఖను పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ లిఖిత పూర్వక అనుమతి కోరారు. అనుమతిపై ఇప్పటి వరకు పోలీస్ కమిషనరేట్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. సిటీ పోలీస్ యాక్ట్ అమలుతో బీఆర్ఎస్ రజతోత్సవ సభ చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే సభా ఏర్పాట్లలో బీఆర్ఎస్ నేతలు నిమగ్నమయ్యారు. ఈ విషయంలో కోర్టును బీఆర్ఎస్ నేతలు ఆశ్రయించనున్నారు. ఇప్పటికే ఈ సభ కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. గత వారం రోజులుగా సిద్దిపేట ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌‌లో ఆయా ఉమ్మడి జిల్లాల నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

మరోవైపు BRS బలోపేతంపై గులాబీ దళపతి చంద్రశేఖర్ రావు దృష్టి కేంద్రీకరించారు. ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్న ఆయన... పార్టీ రజతోత్సవ సభ అనంతరం సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టేందుకు... ప్రణాళిక రచించారు. తర్వాత గ్రామ స్థాయి నుంచి కమిటీల నిర్మాణం, జిల్లా పార్టీ కార్యాలయాలు కేంద్రంగా... శిక్షణా తరగతులు నిర్వహించాలని భావిస్తున్నారు. ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో ఉమ్మడి మహబూబ్ నగర్ , నల్గొండ, ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమైన KCR.. తెలంగాణ ప్రజలకు పాలేవో, నీల్లేవో స్పష్టంగా తెలిసిందన్నారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్  వంటి మౌలిక వసతుల కల్పనలో కాంగ్రెస్  ప్రభుత్వం వైఫల్యం.. శోచనీయం అన్నారు. HCU విద్యార్థులకు KCR అభినందనలు తెలిపారు. భూముల విషయంలో ప్రభుత్వం వైఖరి సరికాదన్నారు. విద్యార్థులకు మద్దతుగా నిలిచిన పార్టీ శ్రేణులకు.. ఆయన అభినందనలు తెలిపారు. HCU ఉదంతాన్ని ప్రభుత్వం గుణపాఠంగా తీసుకోవాలని సూచించారు.తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలబెడితే నిలబెట్టుకోవడం చేతగాలేదని కేసీఆర్  మండిపడ్డారు. దేశవ్యాప్తంగా తెలంగాణ పరువు,ప్రతిష్టలు దిగజార్చేలా వ్యవహరిస్తుండడంశోచనీయమని అన్నారు.

ఇది కూడా చూడండి: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు