ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి బిగ్ షాక్.. అడ్డుకున్న గ్రామస్థులు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డిని జనగామ జిల్లా గిర్నీ తండాలో గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎన్నికల హామీల్లో డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులకు రూ.50వేలు ఇస్తానని హామీ ఇవ్వడంతో ఆ హామీని ఇంకెప్పుడు నెరవేరుస్తారని ప్రజలు ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని నిలదీశారు. By Seetha Ram 01 Nov 2024 in తెలంగాణ వరంగల్ New Update షేర్ చేయండి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డికి నిరసన సెగ తగిలింది. జనగామ జిల్లా గిర్నీ తండాలో యశస్వినిరెడ్డిని గ్రామస్తులు అడ్డుకున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలిస్తుండగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని అడ్డగించారు. ఇది కూడా చదవండి: సమీపిస్తున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. ఎంతమంది బరిలో ఉన్నారంటే సమస్యలు పట్టించుకోరా..? ఎన్నికల హామీల్లో డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులకు రూ.50వేలు ఇస్తానని హామీ ఇచ్చారని.. ఆ హామీని ఇంకెప్పుడు నెరవేరుస్తారని ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని ప్రజలు నిలదీశారు. తమ సమస్యలు పట్టించుకోరా..? అని ప్రశ్నించారు. ఎన్నికల హామీలు నెరవేర్చరా..? అంటూ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేకు సమస్యలు విన్నవిస్తుండగా కాంగ్రెస్ నేతలు వారిని పక్కకు తోసేశారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేను కలవనీయకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: మేమంతా ఒకే పిడికిలి.. రిటెన్షన్ పై హార్దిక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ గతంలో సొంత పార్టీ కార్యకర్తలే తిరగబడ్డారు కాగా గతంలో కూడా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఎదురుగా మహిళా కార్యకర్తలు ఆగ్రహంతో రెచ్చిపోయారు. పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తిలో జరిగిన సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని కొందరు మహిళలు నిలదీశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసాలకు పాల్పడుతున్నారని వారు మండిపడ్డారు. ఇది కూడా చదవండి: త్వరలోనే పాదయాత్ర.. కేటీఆర్ సంచలన ప్రకటన! ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడ్డ తమకు కనీసం గుర్తింపు ఇవ్వడం లేదంటూ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై గొడవకు దిగారు. అయితే సొంత పార్టీ కార్యకర్తలే ఇలా ఎదురు తిరగడంతో అంతా షాక్ అయ్యారు. అందుకు సంబంధించిన వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.. 26 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయంగా ఆమెకు ఎలాంటి అనుభవం లేకపోయినా.. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. యశస్విని అత్త అయిన హనుమండ్ల ఝాన్సీ రెడ్డిది పాలకుర్తి నియోజకవర్గం. ఆమె కుటుంబానికి అమెరికాలో స్థిరాస్తి వ్యాపారం ఉంది. తమ నియోజకవర్గం నుంచి ఝూన్సీ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ ఖాయమైంది. ఇది కూడా చదవండి: పొంగులేటికి షాక్ ఇచ్చిన సీనియర్లు.. ఆ అంశాలపై హైకమాండ్ కు ఫిర్యాదు! అయితే ఆమెకు భారత పౌరసత్వం విషయంలో చిక్కులు రావడంతో ఝూన్సీ రెడ్డికి బదులుగా ఆమె కోడలు యశస్విని రెడ్డికి పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఖాయం అయింది. దీంతో తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన యశస్విని రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావుపై ఘన విజయం సాధించారు. ఏకంగా ఆరుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా గెలిచిన ఎర్రబెల్లిని ఆమె ఓడించింది. #yashaswini-reddy #ts-congress మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి