హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్.. ఈ రోజు నుంచి కొత్త రూల్!

నాగోల్ - మియాపూర్ మెట్రో స్టేషన్లలో పెయిడ్ పార్కింగ్ విషయంలో ఎల్ అండ్‌ టీ గత కొద్ది నెలలుగా కాలయాపన చేస్తూ వచ్చింది. నేటి నుంచి ఈ పెయిడ్ పార్కింగ్‌ను అమలు చేయనుంది. ప్రస్తుతం పార్కింగ్ ఏరియాల్లో ఛార్జీల బోర్డులు ఏర్పాటు చేసింది.

New Update
Paid parking,

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఊహించని షాక్ తగిలింది. ఇదివరకు నాగోల్ - మియాపూర్ మెట్రో స్టేషన్లలో పెయిడ్ పార్కింగ్ విషయంలో ఎల్ అండ్‌ టీ గత కొద్ది నెలలుగా కాలయాపన చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. పెయిడ్ పార్కింగ్‌ను ఎట్టకేలకు అమలు చేసింది. నేటి నుంచి ఈ పెయిడ్ పార్కింగ్‌ను అమలు చేయనుంది.

ఇది వరకు గతంలో దాదాపు 3 సార్లు బోర్డులు ఏర్పాటు చేసింది. దీంతో ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేక రావడంతో కాస్త వెనక్కి తగ్గింది. ఈ మేరకు ఈ నెల 26న ఆయా మెట్రో స్టేషన్లలో పెయిడ్ పార్కింగ్ తీసుకొస్తున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.

ఇది కూడా చదవండి: డీజే టిల్లూ పాటకు మంత్రి కోమటిరెడ్డి డ్యాన్స్-Viral Video

ఈ నేపథ్యంలో ప్రస్తుతం పార్కింగ్ ప్రాంతాల్లో ఛార్జీల బోర్డులు ఏర్పాటు చేసింది. ఈ ప్రస్తుత పార్కింగ్ ఛార్జీలు చూసుకుంటే గతంలో కంటే ఇప్పుడు కాస్త తగ్గాయి. ఇదిలా ఉంటే దీనిపై మెట్రో ప్రయాణికులు, యువజన సంఘాలు సైతం మండిపడుతున్నాయి. పెయిడ్ పార్కింగ్‌ను వెంటనే రద్దు చేయాలని నాగోల్ స్టేషన్ వద్ద శనివారం నిరసన చేపట్టారు.

గతంలో ఛార్జీలు

టూ వీలర్ 


కనీసం రెండు గంటల వరకు - రూ.10
8 గంటల వరకు - రూ.25
12 గంటల వరకు - రూ.40
12 గంటలు పైబడితే ప్రతీ గంటకు రూ.5

ఫోర్ వీలర్

ఇది  కూడా చదవండి: కాసేపట్లో రాజేంద్రప్రసాద్ కుమార్తె అంత్యక్రియలు

2 గంటల వరకు - రూ.30
8 గంటల వరకు - రూ.75
12 గంటల వరకు - రూ.120
12 గంటలకు పైబడితే ప్రతి గంటకు - రూ.15

ప్రస్తుత ఛార్జీలు

టూ వీలర్

0 నుంచి 2 గంటల వరకు - రూ.10
2 నుంచి 3 గంటల వరకు - రూ.15
3 నుంచి 4 గంటల వరకు - రూ.20
4 నుంచి 12 గంటల వరకు - రూ.25

ఫోర్ వీలర్

0 నుంచి 2 గంటల వరకు - రూ.30
2 నుంచి 3 గంటల వరకు - రూ.45
3 నుంచి 4 గంటల వరకు -  రూ.60
4 నుంచి 12 గంటల వరకు - రూ.75గా నిర్ణయించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు