Metro Rail: మెట్రో విస్తరణకు వ్యతిరేకం..హైకోర్టులో పిల్

హైదరాబాద్ మెట్రో విస్తరణకు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఏపీడబ్ల్యూఎఫ్ ఈ పిటిషన్ ను దాఖలు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మెట్రో ఎండీ, వక్ఫ్ బోర్డు సీఈవోలను ప్రతివాదులు గా చేర్చారు.

New Update
Old City Metro Rail

Old City Metro Rail

Metro Rail: హైదరాబాద్ మెట్రో విస్తరణకు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. ఏపీడబ్ల్యూఎఫ్ ఈ పిటిషన్ ను దాఖలు చేసింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, హైదరాబాద్ మెట్రో ఎండీ, వక్ఫ్ బోర్డు సీఈవోలను ప్రతివాదులుగా చేర్చారు. పాతబస్తీలో మెట్రో నిర్మాణంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చారిత్రక కట్టడాలను పరిగణనలోకి తీసుకోకుండా నిర్మాణం చేపడుతున్నారని పేర్కొంటూ.. పాతబస్తీలో మెట్రో నిర్మాణంపై ఏపీడబ్ల్యూఎఫ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. 

ఇది కూడా చదవండి: BRS : టార్గెట్ సీఎం రేవంత్... ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పెద్ద స్కెచ్!

తెలంగాణ వారసత్వ చట్టం 2017 ప్రకారం.. చారిత్రక కట్టడాలను రక్షించాలని పేర్కొంది. పాతబస్తీ ప్రతిపాదిత మెట్రోమార్గం సమీపంలో చార్మినార్, ఫలక్‌నుమా ప్యాలెస్, పురానా హవేలి, మొఘల్ పురా సమాధులు వంటి చారిత్రక కట్టడాలు ఉన్నాయని వివరించింది. మెట్రో రైలు నిర్మాణం కారణంగా ఈ స్మారక చిహ్నాలకు నష్టం జరిగే ప్రమాదం ఉందని పేర్కొంది. హైదరాబాద్ మెట్రో విస్తరణ కోసం తదుపరి పనులు చేపట్టే ముందు హైకోర్టు లేదా నిపుణుల బృందం ఆమోదం పొందాలని కోరింది. మెట్రో ప్రాజెక్టు డిజైన్‌ను తెలంగాణ హైకోర్టు లేదా సంబంధిత నిపుణుల బృందం చూసి.. పరిశీలించి ఆమోదించిన తర్వాత నిర్మాణంపై ప్రభుత్వం ముందుకు వెళ్లాలని కోరింది.  అప్పటివరకు పనులను నిలిపివేయాలని ఏపీడబ్ల్యూఎఫ్ హైకోర్టును విజ్ఞప్తి చేసింది. ఫిబ్రవరి 17న హైకోర్టు ఈ విషయంపై తదుపరి విచారణకు ఆదేశిస్తూ వాయిదా వేసింది.

ఇది కూడా చదవండి: Maoist: మావోయిస్టులపై లాస్ట్ ఆపరేషన్.. PLGA ఆవాసంలోకి చొచ్చుకెళ్లిన భద్రతా బలగాలు!

హైదరాబాద్ మెట్రో మొదటి దశలో భాగంగా జేబీఎస్ నుంచి ఫలక్‌నుమా మార్గంలో మెట్రో రైలు నిర్మాణం పూర్తి కాలేదు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో మార్గంలో పాతబస్తీలో మెట్రో నిర్మించేందుకు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. అయితే ప్రాజెక్టు డిజైన్‌లో కొన్ని మార్పులు చేసిన తర్వాత.. ప్రస్తుతం ఆ మార్గంలో మెట్రో రైలు విస్తరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ మార్గంలో మెట్రో విస్తరణపై కొందరు హైకోర్టుకు ఎక్కారు. దీనిపై ఏపీడబ్ల్యూఎఫ్‌ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

ఇది కూడా చదవండి: అల్లం టీలో రెండు పదార్థాలు కలిపి తాగండి... ఆ సమస్యల్ని పరార్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు