Shabbir Ali: కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయింది
సీఎం కేసీఆర్‌పై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 1500 కోట్లతో ప్రగతి భవన్‌ను నిర్మించుకున్న కేసీఆర్.. ప్రజలకు మాత్రం నీటిలో ఇళ్లు నిర్మించి ఇచ్చారన్నారు.
సీఎం కేసీఆర్‌పై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 1500 కోట్లతో ప్రగతి భవన్‌ను నిర్మించుకున్న కేసీఆర్.. ప్రజలకు మాత్రం నీటిలో ఇళ్లు నిర్మించి ఇచ్చారన్నారు.
కొంతమంది వక్రబుద్ధితో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. వారి సుఖం కోసం పిల్లలను, జీవితాన్ని కష్టాలలోకి నెట్టేస్తున్నారు. ఈ మధ్య కాలంలో చోటుచేసుకుంటున్న సంఘటనలే ఇందుకు నిదర్శనం. భవిష్యత్‌ను అంధకారంగా మార్చుతున్నా.. కటకటాల్లోకి వెళ్తున్నా.. పిల్లలు గోడువెళ్లబోస్తున్నా.. వారు మాత్రం మారటం లేదు. ఇలాంటి గదే మరొకటి.
నిజామాబాద్‌లో బీటెక్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమ వేధింపులు తట్టుకోలేక స్నేహా తివారీ ఉరేసుకుంది. సోఫియాన్ అనే విద్యార్థి వేధింపులే కారణమని.. రోజూ ప్రేమించాలని వేధించేవాడంటున్న కుటుంబసభ్యులు.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండుకుండలా మారాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో జుక్కల్ లోని నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు జలకళ సంతరించుకుంది. దీంతో అధికారులు నిజాంసాగర్ గేట్లు ఎత్తిని నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
హైదరాబాద్‌లో వాన దంచికొడుతోంది. ఈ కుంభవృష్టి ధాటికి నగరంలో రోడ్లన్ని జలమయమయ్యాయి. మియాపూర్‌లో 11.45 సెంటీ మీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. ప్రజలు బయటకు రాలేని పరిస్థితులు ఏర్పాడ్డాయి. అత్యవసరం అయితే తప్ప బయటకు అడుగు పెట్టవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు కామారెడ్డిలో అత్యధికంగా 104.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
జై కేసీఆర్..సీఎం కేసీఆర్ రావాలి... కేసీఆర్ కావాలి’, దేశ్ కీ నేత కేసీఆర్’ అనే నినాదాలతో పెళ్లి మండపం దద్దరిల్లింది. సీఎం కేసీఆర్ ప్రముఖుల పెళ్లి ఫంక్షన్స్‌కు వెళ్లడం కొత్త విషయం కాదు. కానీ, హైదరాబాద్‌లో జరిగిన కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కుమారుడి వివాహానికి వెళ్లడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జై కేసీఆర్..సీఎం కేసీఆర్ అంటూ యువకుల కేరింతలతో పెళ్లి మండపం మారుమోగింది.
నిజామాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాలతో రైతులు నష్టాలపాలవుతున్నారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వీటి దందా కొనసాగుతూనే ఉంది. కల్తీ విత్తనాలతో పంట నష్టపోయిన అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పంటకు పెట్టిన పెట్టుబడి కంటే వచ్చే నష్టమే ఎక్కువుగా ఉంటుందని వాపోతున్నారు.
నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల పరిధిలోని మెండోర గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ ఢీకొనడంతో ఆర్ఎంపీ డాక్టర్ మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు మృతదేహంతో ట్రాక్టర్ యాజమాని ఇంటిముందు ఆందోళనకు దిగారు.