BJP: వాళ్లను గెలిపించి వీళ్లు ఓడారు.. తెలంగాణ బీజేపీలో విచిత్రం
ఎంపీలుగా ఉన్న బీజేపీ రాష్ట్ర నేతలు ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు ఇద్దరూ తమ పరిధిలో అభ్యర్థులను గెలిపించుకునీ అనూహ్యంగా తామే ఓటమి పాలయ్యారు. పూర్వ ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు, పూర్వ నిజామాబాద్ జిల్లాలోని మూడు స్థానాల్లో బీజేపీ జెండా పాతింది.