Telangana: లోక్సభ ఎన్నికలకు ముందే కేబినెట్ విస్తరణ! కసరత్తు మొదలుపెట్టిన సీఎం
కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందే విస్తరణ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం ఢిల్లీ బయలుదేరారు. పార్టీ పెద్దలతో భేటీ తర్వాత తుది నిర్ణయం వెల్లడించనున్నట్లు సమాచారం.