TS Weather Update: తెలంగాణలో ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. భానుడి భగభగలతో కొట్టుమిట్టాడిన తెలంగాణ ప్రజానీకానికి వరణుడు చల్లటి కబురందించాడు. ఎండల వేడిమి నుంచి తట్టుకునేలా చిరుజల్లులు కురిపించాడు. గురువారం సాయంత్రం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు నమోదు అయ్యాయి. శుక్రవారం సాయంత్రం నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాలో భారీగా వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీగా పంట నష్టం వాటిల్లింది. ఓ ఇల్లుపై పిడిగుపడింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈదురుగాలులకు ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. ఈ వర్షాలు మరో ఐదురోజుల పాటు కొనసాగనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పలు జిల్లాలను హెచ్చరించింది హైదరాబాద్ లోని వాతావరణ శాఖ.
పూర్తిగా చదవండి..TS Weather Update: ఆ జిల్లాల ప్రజలకు అలర్ట్..వడగళ్ల వాన పడే ఛాన్స్..బయటకు రావొద్దంటున్న ఐఎండి.!
తెలంగాణలో వాతావరణం ఒక్కసారి మారిపోయింది.నిప్పుల కొలమిలా రాష్ట్రాన్ని వరణుడు చల్లబరిచాడు. మరో ఐదు రోజులు ఇదే పరిస్థితి ఉండనుంది. ముఖ్యంగా 12 జిల్లాల్లో వడగళ్ల వానలుకురిసే అవకాశం ఉందని ప్రజలు బయటకు రావొద్దంటూ ఐఎండీ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
Translate this News: