BRS : ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్
TG: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో కవిత కస్టడీని మరోసారి పొడిగించింది. ఈ నెల 20 వరకు కవిత కస్టడీ పొడిగిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
TG: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో కవిత కస్టడీని మరోసారి పొడిగించింది. ఈ నెల 20 వరకు కవిత కస్టడీ పొడిగిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, వైసీపీ నాయకులు ప్రసాద్ రాజు తదితరులు మాజీ పీసీసీ చీఫ్ డీ.శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. డీఎస్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.
గత నెల 29న అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ పీసీసీ చీఫ్ డీ.శ్రీనివాస్ కుటుంబాన్ని నిజామాబాద్ లోని వారి నివాసంలో మంత్రి సీతక్క ఈ రోజు పరామర్శించారు. డీఎస్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన మృతి తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు అని అన్నారు.
ఈ నెల 4న తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, శ్రీహరికి మంత్రి పదవులు ఖాయమని తెలుస్తోంది. ప్రేమ్ సాగర్ రావు, వివేక్ లో ఒకరికి మంత్రి వర్గంలో చోటు దక్కే ఛాన్స్ ఉంది.
ఎమ్మెల్సీ కవితకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించిన సీబీఐ, ఈడీ కేసుల్లో ఆమెకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. ఇటీవల రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు బెయిల్ ఇవ్వకపోగా హైకోర్టును ఆశ్రయించారు. తాజగా హైకోర్టు కూడా బెయిల్‌కు నిరాకరించింది.
TG: కాంగ్రెస్ పార్టీకి డీఎస్ ఎంతో సేవ చేశారని అన్నారు సీఎం రేవంత్. పీసీసీ అధ్యక్షుడుగా 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి డీఎస్ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని సీఎం అన్నారు.
TG: కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు చేయూలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో రేపు అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు జరగనున్నాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర పిసిసి మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి, సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌లో డీఎస్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.