RTC Bus Driver: సాధారణంగా బస్సులో దొంగతనాలు జరగడం చూస్తూనే ఉంటాము. అయితే తాజాగా బస్సు డ్రైవరే దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ఘటన చోటుచేసుకుంది. రన్నింగ్ బస్సులోనే ఆర్టీసీ డ్రైవర్ చేతివాటం చూపించాడు.
Also Read: విష్ణు ప్రియా NTR నటించిన ఆ సూపర్ హిట్ సినిమాలో యాక్ట్ చేసిందట..! మీకు తెలుసా
బ్యాగ్ లో నుంచి సైలెంట్ గా
వరంగల్ నుంచి నిజామాబాద్ కు వెళ్తున్న బస్సులో ఓ మహిళా డ్రైవర్ సీటు పక్కనే బంగారం బ్యాగ్ పెట్టింది. ఆ బ్యాగ్ పై కన్నేసిన డ్రైవర్ బస్సు నడుపుతూనే సైలెంట్‌గా బంగారాన్ని నొక్కేశాడు. ఇదంతా గమనిస్తున్న ఓ ప్రయాణికుడు డ్రైవర్ బాగోతాన్ని సెల్ ఫోన్లో రికార్డు చేసి పోలీసులకు సమాచారం అందించాడు. అనంతరం పోలీసులు బస్సు ఆపేసి నిలదీయడంతో బస్సు డ్రైవర్ దొంగతనం ఒప్పుకున్నాడు. ఈ దొంగతనానికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.
Also Read: HBD Kamal Haasan: కమల్ హాసన్ కు మాత్రమే సాధ్యమైన ఈ రికార్డుల గురించి తెలుసా?
ఇది ఇలా ఉంటే ఇటీవలే రాజస్థాన్ లో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో అమెజాన్ కు కోట్లలో కన్నం వేశారు ముగ్గురు యువకులు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడ్డారు. ఆఖరికి పోలీసులకు చిక్కారు.
రాజస్థాన్ కు చెందిన రాజ్ కుమార్, సుభాష్ గుర్జార్ అనే ఇద్దరు యువకులు పక్కాగా ప్లాన్ వేసుకున్నారు. అమెజాన్ నుంచి కొన్ని ప్రొడెక్టులను విడి విడిగా ఆర్డర్ చేసేవారు. వాటిలో ఎక్కువ ధర ప్రొడెక్టులు కొన్ని, తక్కువ ధర ప్రొడెక్టులు కొన్ని ఉండేలా చూసుకునేవారు. ఆ ప్రొడెక్టులను ఫేక్ ఐడీస్ తో ఆర్డర్ చేసేవాళ్లు. అయితే అంత వరకు బాగానే ఉంది. కానీ ఆ వస్తువుల డెలివరీ చేసే సమయంలో డెలివరీ బాయ్ లను తిరకాసు చేసేవారు. ఎక్కువ ధర ప్రొడెక్ట్ స్టిక్కర్లను తక్కువ ధర ప్రొడెక్టులకు మార్చేసే వాళ్లు. అయితే వారు స్టిక్కర్లు మార్చిన విషయం తెలియక డెలివరీ బాయ్స్ తక్కువ ధర కలిగిన ప్రొడెక్టులను రిటర్న్ తీసుకెళ్లిపోయేవారు.ఇలా దాదాపు 8 రాష్ట్రాల్లో ఈ దందా జరిపారు. చివరికి పోలీసులకు దొరికిపోయారు.
Also Read: మాటలకు కొత్త పుంతలు తొక్కించాడు.. టాలీవుడ్ మనసును గెలిచాడు.. మాటల మాంత్రికుడి బర్త్ డే స్పెషల్!
Also Read: బిగ్ బాస్ ఇంట్లోకి యష్మీ ఫాదర్.. ఆ విషయంలో కూతురి కోసం క్షమాపణలు..!