హనుమకొండ, కరీంనగర్‌ జిల్లాలను కలుపుతూ రైలుమార్గం !

హనుమకొండలోని హసన్‌పర్తి రోడ్‌ నుంచి కరీంనగర్‌ వరకు కొత్త రైల్వే మార్గం అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్మాణానికి సంబంధించి అధికారులు డీపీఆర్‌ కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.1400 కోట్లు అవుతుందని అంచనా.

train 2
New Update

హనుమకొండ, కరీంనగర్ జిల్లాలను కలుపుతూ త్వరలో కొత్త రైల్వే మార్గం అందుబాటులోకి రానున్నాయి. హనుమకొండలోని హసన్‌పర్తి రోడ్‌ నుంచి కరీంనగర్‌ రైల్వే స్టేషన్‌ మధ్య రైళ్లు పరుగులు పెట్టే ఛాన్స్ ఉంది. మంగళవారం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. రైలు మార్గం పనులు త్వరగా చేపట్టాలని కోరారు. దీనికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం వరంగల్ నుంచి కరీంనగర్‌కు వెళ్లేందుకు రోడ్డు మార్గం మాత్రమే అందుబాటులో ఉంది. కరీంనగర్‌లో రైల్వే స్టేషన్‌ను నిర్మించినప్పటికీ అక్కడి నుంచి వారానికి రెండుసార్లు మాత్రమే తిరుపతి ఎక్స్‌ప్రెస్, నిజామాబాద్‌, సిర్‌పూర్‌కాగజ్‌ నగర్‌కు మెము రైళ్లు, గూడ్సు రైళ్లు నడుస్తున్నాయి. దీంతో రైల్వే స్టేషన్‌ ఖాళీగా ఉంటుంది. కాజీపేట రైల్వే స్టేషన్‌ నుంచి కరీంనగర్‌కు రైలుమార్గం ఏర్పడితే రోడ్డు మార్గం గుండా వెళ్లడానికి దూరంతో పాటు ఖర్చు కూడా తగ్గుతుంది. బస్సు ప్రయాణం కంటే రైలు ప్రయాణం తక్కువ ధరకే ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కరీంనగర్‌కు వెళ్లేవారు రైళ్లను ఆశ్రయించే ఛాన్స్ ఉంది.

Also Read: కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

గతంలోనే ప్రతిపాదనలు 

వాస్తవానికి హసన్‌పర్తి రోడ్‌ నుంచి కరీంగర్‌కు రైలు మార్గం 2011-12 లోనే ప్రతిపాదించారు. 2014 బడ్జెట్‌లో కూడా దీన్ని ప్రస్తావించారు. కానీ ఆ తర్వాత దీన్ని ఎవరూ పట్టించుకోలేదు. హసన్‌పర్తి నుంచి కరీనంగర్‌ వరకు 62.05 కిలోమీటర్లతో రూ.464 కోట్లతో ప్రతిపాదనలు వచ్చాయి. కేంద్రం కూడా1.50 కోట్లు విడుదల చేయడంతో అధికారులు భూమి సర్వే కూడా చేయించారు. దండేపల్లి, హుజూరాబాద్, తడిగల్, అన్నారం మీదుగా కరీంనగర్‌ వరకు సాటిలైట్‌ సర్వే చేశారు. ఇప్పడు భూసేకరణ చేసి టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తే.. 2029 నాటికి హనుమకొండ నుంచి నేరుగా కరీంనగర్‌కు రైలు వెళ్తుందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు.

కరీంనగర్‌ గ్రానైట్‌కు కొదవ లేదు. ఇప్పక ఏర్పడే గ్రానైట్ రాళ్లను ఉప్పల్‌ రైల్వే స్టేషన్‌ లేదా కాజీపేట వరకు లారీలలో తీసుకొస్తారు. ఆ తర్వాత గూడ్సు రైళ్ల ద్వారా కాకినాడ పోర్టుకు చేర్చి అక్కడి నుంచి విదేశాలకు పంపుతారు. ఇప్పుడు కరీంనగర్ నుంచి వరంగల్‌కు మార్గం ఏర్పడితే అవి నేరుగా వెళ్తాయి. అలాగే వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువుల రవాణాకు సికింద్రాబాద్‌ మార్గంలో అంతరాయం ఏర్పడితే రైళ్లను కరీంనగర్‌ మీదుగా మళ్లించేందుకు రైల్వేకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు ప్రారంభ దశలో ఉన్న మణుగూరు-రామగుండ రైలు మార్గం పూర్తయితే బొగ్గు రవాణా కరీంనగర్‌ మీదుగా మహారాష్ట్రకు పంపేందుకు కూడా సులువు అవుతోంది.

Also Read: 9 నెలల నకిలీ గర్భం.. బాత్రూమ్‌లో అబార్షన్.. కంగుతిన్న డాక్టర్లు!

రూ.1400 కోట్లు అంచనా

కరీంనగర్‌కు కొత్త రైలు మార్గం వల్ల ఉమ్మడి వరంగల్‌కు నిజామాబాద్‌కు కూడా ప్రయాణ సౌకర్యం మెరుగుపడుతుంది. కరీంనగర్‌ నుంచి జగిత్యాల, కోర్టు మీదుగా నిజామాబాద్‌ చేరుకునే ఛాన్స్ ఉంది. అక్కడి నుంచి శిర్డీ, మహారాష్ట్రకు కూడా వెళ్లొచ్చు. కరీంనగర్‌ ప్రజలకు కాజీపేట మీదుగా సికింద్రాబాద్ వెళ్లేందుకు మరో మరో మార్గం కూడా అందుబాటులోకి రానుంది. హసన్‌పర్తి నుంచి కరీంనగర్‌ వరకు రైల్వే మార్గానికి సంబంధించి డీపీఆర్‌ కూడా సిద్ధమైంది. దీని వ్యయం రూ.1400 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

#telangana #train #indian-railways
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe