Neera Cafe: నీరా కేఫ్‌ వివాదం...ప్రభుత్వం సంచలన నిర్ణయం

నీరాకేఫ్‌ వివాదం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది.హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్డులో ఉన్న నీరా కేఫ్‌ను తొలగిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్నిప్రభుత్వం ఖండించింది. నీరాకేఫ్‌ను మూసివేయాలనే ప్రతిపాదన లేదని ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

New Update
 neera cafe

neera cafe

Neera Cafe: హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ నెక్లెస్‌ రోడ్డులో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన నీరాకేఫ్‌ను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రచారం సాగుతోంది. నీరాకేఫ్‌ను అక్కడినుంచి తొలగించి దాన్ని హోటల్‌గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు ప్రచారం సాగుతోంది. కాగా ఈ మేరకు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కేఫ్‌ను సందర్శించిన ఆయన మాట్లాడుతూ నీరా కేఫ్‌ను సుల్తాన్ బ‌జార్‌లోని చాట్ భండార్‌లాగా మార్చార‌ని సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కార్‌పై ఆగ్రహాం వ్యక్తం చేశారు.కాగా నీరాకేఫ్‌ను ఎత్తివేయాలనే నిర్ణయాన్ని మానుకోవాలని డిమాండ్‌ చేశారు.

 Also Read: Boney Kapoor: ఇంట్లో అలా చేస్తే తప్పేంకాదు.. అలహాబాదియా వివాదంపై శ్రీదేవి భర్త షాకింగ్ కామెంట్స్!


కాగా నీరాకేఫ్‌ వివాదం నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది.హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో ఉన్న నీరా కేఫ్‌ను తొలగిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖండించింది. ఈ మేరకు నీరా కేఫ్‌పై ఎక్సైజ్ శాఖ అధికారులు ఇవాళ(ఆదివారం) ఓ ప్రకటన విడుదల చేశారు. నీరా కేఫ్‌ను మూసివేయాలనే ప్రతిపాదనలు తమకు లేవని స్పష్టం చేశారు. మొదటి నుంచి ఫుడ్ కోర్టులు కేఫ్‌లో భాగంగానే ఉన్నాయని తెలిపారు. నీరా కేఫ్‌ను తొలగించి అక్కడ హోటళ్లు ఏర్పాటుచేసే ప్రతిపాదనలు లేవని తేల్చిచెప్పారు. నీరా కేఫ్‌ను డాక్టర్ వినోద్ గౌడ్‌కు చెందిన మెస్సర్స్ తనీరా పామ్ ప్రొడక్ట్స్ డెవలప్‌మెంట్ సొసైటీ నిర్వహిస్తోందని తెలిపారు. నీరా కేఫ్ ఇప్పటికీ తన కార్యకలాపాలను కొనసాగిస్తోందని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది.


 Also Read: ఇండియాపై ఇంత ప్రేమా.. ఆస్ట్రేలియా వ్యక్తి చివరి కోరిక గురించి తెలిస్తే షాక్!


హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో గత ప్రభుత్వం సుమారు రూ.12 కోట్ల వ్యయంతో అత్యాధునిక వసతులతో నీరాకేఫ్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నీరా కేఫ్‌లో తాటి,ఈత వనం స్పూరించేలా తాటిమొద్దులు, ఈత మొద్దులపై కూర్చోడానికి వీలుగా సీట్లను డిజైన్‌ చేశారు. అంతేకాక ఇక్కడి స్టాల్‌ పూర్తిగా తెలంగాణ నాన్‌వెజ్‌ వంటకాలైన తలకాయ కూర, బోటీ, పాయ వంటివి వడ్డిస్తారు. దీంతో ఇక్కడికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. నీరా ఆరోగ్యానికి మంచిది. దీన్ని గుర్తించిన నాటి ప్రభుత్వం గీతకార్మికుల అస్తిత్వానికి ప్రతీకగా నీరాకేఫ్‌ను నిర్మించింది. అలాంటి నీరాకేఫ్‌ను తొలగించాలనే ప్రతిపాదనను గౌడ కులస్తులు ఖండిస్తున్నారు.

Also Read: ఫ్రీగా కుంభమేళా ట్రిప్.. రూపాయి ఖర్చు పెట్టకుండా 1500KM ప్రయాణం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు