BIG BREAKING: గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష.. సబితా కు క్లీన్ చీట్.. ఓబులాపురం మైనింగ్ కేసులో సంచలన తీర్పు!

ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డితో పాటు మరో ఐదుగురికి నాంపల్లి కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ఏ9గా ఉన్న సబితా ఇంద్రారెడ్డికి క్లీన్ చీట్ ఇచ్చింది. 2009లో కేసు నమోదు కాగా.. 14 ఏళ్ల తర్వాత నేడు తీర్పు ఇచ్చింది న్యాయస్థానం.

New Update
Court

Court

ఓబులాపురం మైనింగ్ కేసులో (OMC) నాంపల్లి కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మొత్తం ఐదుగురిని దోషులుగా తేల్చింది. ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. నాడు గనుల శాఖ మంత్రిగా పని చేసిన సబితా ఇంద్రారెడ్డికి క్లీన్ చీట్ ఇచ్చింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి కృపారెడ్డిని సైతం నిర్దోషిగా ప్రకటించింది. గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వీడీ రాజగోపాల్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి పీఏ అలీఖన్ ను దోషులుగా తేల్చింది న్యాయస్థానం. వీరందరికీ ఏడేళ్ల శిక్షను విధించింది. 

2009లో కేసు..

ఆంధ్ర-కర్ణాటక బార్డర్ ఏరియాతో పాటు, అనంతపురం, బళ్లారి రిజర్వ్‌డ్‌ ఫారెస్ట్‌ ఏరియా, అనంతపురం జిల్లా ఓబుళాపురం పరిధిలో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమంగా ఇనుప గనులను తవ్విందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అప్పటి సీఎం రోశయ్య ఈ వ్యవహారంపై 2009 డిసెంబర్ 7న సీబీఐకి కంప్లైంట్ చేశారు. దీంతో కేసు నమోదు చేసిన సీబీఐ విచారణ చేపట్టింది.

ఈ కేసుకు సంబంధించిన మొదటి ఛార్జిషీట్ ను 2011లో దాఖలు చేసింది సీబీఐ. మొత్తం రూ.884.13 కోట్ల ప్రజాధనం లూటీ చేసినట్లు తేల్చింది. నాంపల్లి కోర్టు ఇందుకు సంబంధించి మొత్తం 219 మంది సాక్షులను విచారించింది. 3400 డ్యాక్యుమెంట్లను పరిశీలించింది. అనంతరం ఎట్టకేలకు నేడు తుది తీర్పును వెల్లడించింది. 

ఈ కేసులో ఏ1గా బీవీ శ్రీనివాసరెడ్డి, ఏ2గా గాలి జనార్దన్ రెడ్డి, ఏ3గా వీడీ రాజగోపాల్, ఏ4గా ఓఎంసీ కంపెనీ, ఏ5గా లింగారెడ్డి. ఏ6గా శ్రీలక్ష్మి, ఏ7గా మెఫజ్ అలీఖాన్, ఏ8గా కృపానందం, ఏ9గా సబితా ఇంద్రారెడ్డిని సీబీఐ చేర్చింది. అయితే.. ఇందులో ఏ1, ఏ2, ఏ3, ఏ4, ఏ7కు ఏడేళ్ల శిక్ష పడింది. ఏ5గా ఉన్న లింగారెడ్డి విచారణ జరుగుతున్న సమయంలోనే చనిపోయారు. ఏ6గా ఉన్న అప్పటి గనుల శాఖ కార్యదర్శి అయిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని కేసు నుంచి హైకోర్టు గతంలోనే డిశ్చార్జి చేసింది.

(gali-janardhan-reddy | telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు