నాలాల నిర్వహణ బాధ్యతలు వారికే అప్పగింత !

రహదారుల తరహాలోలాగే హైదరాబాద్‌లో నాలలను కూడా ప్రైవేటు సంస్థలకే అప్పగించాలని అధికారులు యోచిస్తున్నారు. ఇలా చేయడం వల్లే నాలల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.

Nalas
New Update

రహదారుల తరహాలోలాగే హైదరాబాద్‌లో నాలలను కూడా ప్రైవేటు సంస్థలకే అప్పగించాలని అధికారులు యోచిస్తున్నారు.  కాంప్రహెన్సివ్‌ రోడ్‌ మెయింటెనెన్స్‌ ప్రోగ్రామ్‌(CRMP)తో నగరంలో ప్రధాన రహదారుల పరిస్థితి గతంతో పోల్చి చూస్తే ఇప్పుడు మెరుగ్గా ఉందని.. అందుకే నాలాలను కూడా ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని భావిస్తున్నారు. ఇలా చేయడం వల్లే నాలల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అనుకుంటున్నారు. దీన్ని అమలు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. నగరంలో జోన్ల వారీగా తీవ్ర ముంపనకు గురవుతున్న ప్రాంతాల వివరాలను కేంద్ర కార్యాలయం సేకరిస్తోంది. రోడ్లు , ఇతర ప్రాజెక్టుల లాగే ఈ నాలాల నిర్వహణను ప్రైవేట్‌కు అప్పగించే కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.  

Also Read: ఫుట్‌పాత్‌ ఆక్రమణలే టార్గెట్.. హైడ్రా నెక్ట్స్ యాక్షన్ ప్లాన్ ఇదే!

నగరంలో ప్రధాన రహదారుల నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు సీఆర్‌ఎంపీలో భాగంగా 812 కి.మీ మేర రోడ్లను ఐదేళ్ల కాలవ్యవధికి ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. ఇందుకోసం రూ.1,839 కోట్ల వ్యయం అంచనా వేశారు. ఈ ఏడాది డిసెంబర్‌కి ఈ గడువు ముగుస్తుంది. అయితే జీహెచ్‌ఎంసీ ఆధీనంలో ఉన్నప్పటితో పోలిస్తే.. ప్రైవేటు సంస్థలు బాధ్యత తీసుకున్నప్పుడే రహదారుల పరిస్థితి కొంత మెరుగైనట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మరిన్ని రోడ్ల నిర్మాణం, నిర్వహణను ప్రైవేటు సంస్థలకు ఇచ్చే అంశంపై అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. అలాగే నాలాల విషయంలో కూడా సరైన నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. 

Also Read: Isha ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట

గ్రేటర్ హైదరాబాద్‌లో 370 కి,మీ మేర పెద్ద నాలాలున్నాయి. గతంలో వర్షాకాలం ముందు మాత్రమే నాలాల పూడికతీత ఉండేది. కానీ నాలుగైదేళ్లుగా సీజన్‌తో సంబంధం లేకుండానే ఎప్పటికప్పుడు నాలాల్లో ఉండే వ్యర్థాలను తొలిగించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనికోసం ప్రతీఏడాది రూ.50 కోట్ల నుంచి రూ.55 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. అయినా కూడా ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోవడం వల్ల వర్షం పడినప్పుడు నాలాలు పొంగిపొర్లే పరిస్థితులు నెలకొన్నాయి. పలు కాలనీలు నీట మునుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నాలాల పూడికతీత బాధ్యతలు ప్రైవేటు సంస్థలకు అప్పగించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.  

Also Read: షేక్ హసీనాను మోదీ బంగ్లాదేశ్‌కి అప్పగిస్తారా?

చాలామంది పాతబట్టలు, సామాగ్రి వంటి వస్తువులు నాలాల్లో వేస్తున్నారు. ఆఖరికి ఇంట్లో వెలువడే చెత్తను కూడా అందులోనే వేస్తున్నారు. దీంతో పూడికతీతతో పాటు ఎవరూ కూడా నాలాల్లో వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం నగరంలో పైలట్‌ ప్రాజెక్టుగా కొన్ని నాలాలను ఎంపిక చేయనున్నారు. వీటిని బాధ్యతలు నిర్వహించేందుకు ఏడాది కాలం పాటు వివిధ ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తారు. ఇది సత్ఫలితాలిస్తే దశల వారీగా ఇత నాలాలకు కూడా విస్తరించేలా చర్యలు తీసుకుంటారు. అయితే ఎన్ని కిలోమీటర్ల మేర అప్పగించాలి, ఇందుకు ఎంత ఖర్చు అవుతుందనే దానిపై అంచనా అధికారులు అంచనా వేయనున్నారు. తాజాగా జీహెచ్‌హెంసీకి కొత్త కమిషనర్‌గా ఇరంబర్తి వచ్చిన నేపథ్యంలో ఆయనతో చర్చించిన తర్వాత ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అధికారులు చెబుతున్నారు. 

Also Read: మందుబాబులకు గుడ్ న్యూస్

 

#telangana #hyderabad #ghmc
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe