TG Crime : భధ్రాధ్రికొత్తగూడెం లో దారుణం...ఇల్లరికం రానందుకు అల్లుడిపై పెట్రోల్ పోసి....

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇల్లరికం రానన్నాడని అల్లుడిపై అత్తమామలు బామ్మర్థులు పెట్రోల్‌ పోసి తగలబెట్టడంతో అల్లుడు గౌతమ్‌ మృతిచెందాడు. తనపై అత్తామామలు, భార్య కుటుంబసభ్యులు పెట్రోల్‌ పోసి నిప్పంటినట్లు గౌతమ్‌ మరణవాంగ్మూలం ఇచ్చాడు.

New Update
betting app suicide

TG Crime

TG Crime : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇల్లరికం రానన్నాడని అల్లుడిపై అత్తమామలు బామ్మర్థులు పెట్రోల్‌ పోసి తగలబెట్టడంతో అల్లుడు మృతిచెందాడు. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం భద్రాధ్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం దంతెలబోరు గ్రామానికి చెందిన గౌతమ్‌కు టేకులపల్లి మండలం రామచంద్రునిపేటకు చెందిన కావ్యతో పెళ్లయింది.పెళ్లైన నాటి నుంచి గౌతమ్ తల్లిదండ్రులతో ఉండేందుకు భార్య కావ్య నిరాకరించింది. భార్య  కావ్య పోరు పడలేక సుజాతనగర్ లో ఇల్లు అద్దెకు తీసుకుని గౌతమ్‌ కాపురం పెట్టాడు. ఎక్కడున్నా తమ కుమారుడి కాపురం చక్కగా ఉంటే చాలని తల్లిదండ్రులు భావించడంతో వారు జోక్యం చేసుకోలేదు.

Also Read:  'చైనాను శత్రువులా చూడొద్దు'.. శామ్‌ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్

కొంతకాలం భాగానే ఉన్నా ఆ తర్వాత తమ పుట్టింట్లోనే కాపురం పెట్టాలని కావ్యతో పాటు అత్తమామలు, బామ్మర్థులు ఒత్తిడి తీసుకువచ్చారన్నారు. ఆస్తికోసం, ఇల్లరికం రావాలని తనను అత్తింటి వారు వేధిస్తున్నట్లు పలుమార్లు కుటుంబసభ్యులతో చెప్పుకుని బాధపడిన గౌతమ్‌. అయితే గౌతమ్‌ అందుకు నిరాకరించడంతో పిల్లలను తీసుకుని కావ్య పుట్టింటికి వెళ్లిపోయింది. అదే సమయంలో గౌతమ్‌ కు పిల్లల్ని చూపించకుండా, ఫోన్‌లో మాట్లాడకుండా కావ్య కట్టడి చేసింది. పలుమార్లు పిల్లల్ని చూడడానికి గౌతమ్‌ వెళ్లగా పిల్లలను చూపించడానికి అత్తమామలు నిరాకరించారు.

Also Read: ఈ స్టూడెంట్ ఐడియాకు సెల్యూట్.. టైం లేదని ఎగ్జామ్ సెంటర్‌కు ఎలా వచ్చాడంటే..?

ఇదిలా ఉండగా ఈనెల 2న పిల్లల్ని చూడాలన్న కోరికతో అత్తవారింటికి వెళ్లిన గౌతమ్‌ను కావ్య కుటుంబ సభ్యలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వాగ్వాదం చెలరేగడంతో కావ్య కుటుంబ సభ్యులు పెట్రోల్‌ పోసి నిప్పంటించారని కుటుంబసభ్యులు తెలిపారు. కాగా 80 శాతం గాయాలతో ఆసుపత్రిలో చేరిన గౌతమ్‌ తనపై అత్తామామలు, కుటుంబసభ్యులు పెట్రోల్‌ పోసి నిప్పంటినట్లు మరణవాంగ్మూలం ఇచ్చాడు. అనంతరం చికిత్స పొందుతూ మరణించాడు. దీంతోగౌతమ్ తండ్రి చిన్న వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కావ్యతండ్రి వెంకటేశ్వర్లు, తల్లి అనురాధ, సోదరులు సతీష్, కార్తీక్ పై కేసునమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు