కన్నీరు తెప్పిస్తున్న తల్లిప్రేమ..కొడుకు కోసం అలా చేసినా దక్కని ప్రాణం తల్లి ప్రేమ వెలకట్టలేదని నిరూపించిందో తల్లి. జనగాం జిల్లా పాలకుర్తి మండలానికి చెందిన సత్తెమ్మ తన కుమారుడు రాముకి కిడ్నీ దానం చేసింది. ఏడాది పాటు అతడు బాగానే ఉన్నాడు. కానీ ఇన్ఫెక్షన్ కారణంగా మళ్లీ హాస్పిటల్‌లో చేరి మృతి చెందాడు. By Seetha Ram 16 Nov 2024 in తెలంగాణ కరీంనగర్ New Update షేర్ చేయండి ప్రతీ తల్లికీ కొడుకు అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి కొడుకును అల్లారు ముద్దుగా పెంచుతుంది తల్లి. కొడుకు ఏ చిన్న తప్పు చేసినా.. సమర్థిస్తూ సర్ధుకుపోతుంది. తన కొడుకును ఎవరైనా ఏదైనా అంటే అస్సలు సహించదు. ఎంతటి వారినైనా ఎదిరిస్తుంది. ఆ సమయంలో తన ప్రాణాలను సైతం లెక్కచేయదు తల్లి. ఇది కూడా చూడండి: వైద్యుల నిర్లక్ష్యం.. ప్రైవేట్ ఆసుపత్రికి రూ.30 లక్షల జరిమానా! తల్లి ప్రేమ వెలకట్టలేనిది అప్పుడే అర్థమవుతుంది.. తల్లి ప్రేమ వెలకట్టలేనిదని. అప్పుడే అర్థం అవుతుంది తల్లిని మించిన యోధులు ప్రపంచంలో మరెవరూ లేరని. అలాంటి ఓ తల్లి తాజాగా తన కొడుకు కోసం ఏకంగా తన ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. తన కుమారుడి ఆరోగ్యం బాగోలేకపోవడం.. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా లేకపోవడంతో సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో తానే ప్రాణాలకు తెగించి ముందుకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇది కూడా చూడండి: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ప్రత్యేకంగా 26 రైళ్లు ఏర్పాటు తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పుట్నూరు గ్రామానికి చెందిన లక్ష్మయ్య, సత్తెమ్మ దంపతుల కుమారుడు రాము (35). అతడికి పెళ్లైయి ఒక భార్య, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. గత కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. డయాలసిస్ కింద ఉపశమనం పొందాడు. అయితే కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. ఇది కూడా చూడండి: ఉన్నత హోదా ఇప్పిస్తామని.. హీరోయిన్ తండ్రికి రూ.25 లక్షలు టోకరా కొడుకు కోసం కిడ్ని దానం వారిది పేద కుటుంబం కావడంతో ఎవరూ ముందుకు రాలేదు. చివరికి రాము తల్లి సత్తెమ్మ తన కిడ్నీని కొడుకుకు దానం చేసింది. తల్లి కిడ్నీ అమర్చిన తర్వాత రాము ఏడాది పాటు ఆరోగ్యంగానే ఉన్నాడు. కానీ కొన్ని రోజుల క్రితం ఇన్ఫెక్షన్ కారణంగా రాము మళ్లీ అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే హైదరాబాద్‌లోని నిమ్స్‌లో అడ్మిట్ చేశారు. పరిస్థితి విషమించడంతో నిన్న (శుక్రవారం) మృతి చెందాడు. ఇది కూడా చూడండి: ట్రంప్ మరో విచిత్ర నిర్ణయం.. వ్యాక్సిన్లు వద్దన్న వ్యక్తికి హెల్త్ మినిస్ట్రీ! మరో విషాదకర విషయం ఏంటేంటే.. సత్తెమ్మ భర్త లక్ష్మయ్య నాలుగేళ్ల క్రితమే మృతి చెందాడు. ఇప్పుడు ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో సత్తెమ్మ కన్నీరుమున్నీరవుతుంది. కట్టుకున్న భర్త లేడు, కనిపెంచిన కొడుకు మరణించడంతో సత్తెమ్మ బోరున విలపిస్తుంది. ఇక ఇంటికి పెద్ద దిక్కు లేకపోవడంతో సత్తెమ్మ, తన కోడలు, ఇద్దరు మనవల్లు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. #sentiment మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి