/rtv/media/media_files/2025/03/12/qP9L3qJJWhynBY1VZIOj.jpg)
CM Revanth Reddy-mohanbabu-vishnu
CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డిని టాలీవుడ్ నటులు మంచు మోహన్‌బాబు, విష్ణు కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఆయనను కలిసిన మోహన్‌బాబు ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. అయితే ఇటీవల మోహన్‌బాబు ఫ్యామిలీలో గొడవలు తలెత్తిన విషయం తెలిసిందే. మోహన్‌బాబు కొడుకులు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య ఆస్తి గొడవలు తలెత్తాయి. ఈ విషయంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో పాటు పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు.
Also Read: Ap Weather:ఏపీలో ఎండలు,వేడిగాలులు...ఈ జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలు!
జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంటివద్ద జరిగిన హైడ్రామాలో మోహన్‌బాబు మీడియా ప్రతినిథులపై దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ గొడవలు ఇలా కొనసాగుతుండగానే నిన్న మోహన్‌బాబుపై ఖమ్మం జిల్లాలో కేసు నమోదైంది. నటి సౌందర్యకు సంబంధించిన భూమి విషయంలో సౌందర్యకు, మోహన్‌బాబుకు మధ్య గొడవలు జరిగాయని, ఆ విషయంలోనే సౌందర్యను మోహన్‌బాబు హత్య చేయించాడని ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అయితే ఈ విషయాన్ని సౌందర్య భర్త ఖండించారు.
ఇది కూడా చదవండి: వివేకా హత్య జరిగిన రోజు అసలేం జరిగిందంటే.. అసెంబ్లీలో సంచలన విషయాలు చెప్పిన చంద్రబాబు!
వరుస వివాదాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిని మోహన్‌బాబు కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే గద్దర్ తెలంగాణ చలన చిత్ర పురస్కారాల విధి విధానాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమోదించిన నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రిని కలిసినట్లు తెలిసింది. ఈ సందర్భంగానే మంచు మోహన్‌బాబు, మంచు విష్ణు మర్యాద పూర్వకంగా కలిసినట్లు తెలిపారు. రేవంత్‌రెడ్డిని కలవడంపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా మంచు విష్ణు స్పందించారు. రేవంత్‌ను కలవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. రేవంత్ గురించి పలు విషయాలు తెలుసుకోవడం, చర్చించడం చాలా అద్భుతంగా ఉందని వ్యాఖ్యానించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు రేవంత్ రెడ్డి అందిస్తున్న మద్దతు, నిబద్ధతను అభినందిస్తున్నామని మంచు విష్ణు పేర్కొన్నారు.
Also Read: Dalailama: భారత్‌లోనే దలైలామా పునర్జన్మ?.. వారసుడిపై బౌద్ధగురువు కీలక ప్రకటన