MMTS Trains: రాత్రి పూట కూడా ఎంఎంటీఎస్‌ సేవలు!

నగర వాసులకు ఎంఎంటీఎస్‌ ఓ తీపి కబురు చెప్పింది.గణేష్ నిమజ్జనం సందర్భంగా.. దక్షిణ మధ్య రైల్వే ఈ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ లో.. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో వినాయక నిమజ్జనంసందర్భంగా ఆ రెండు రోజుల పాటు రాత్రి పూట కూడా సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది.

author-image
By Bhavana
New Update
mmts

MMTS Trains :

నగర వాసులకు ఎంఎంటీఎస్‌ ఓ తీపి కబురు చెప్పింది. సాధారణంగా ఉదయం నుంచి రాత్రి వరకు మాత్రమే సేవలందించే ఎంఎంటీఎస్‌…ఓ రెండు రోజుల పాటు రాత్రి పూట కూడా సేవలందించేందుకు రెడీ అయ్యింది. అయితే…ఈ సర్వీసులు హైదరాబాద్‌ లో గణేష్ నిమజ్జనం సందర్భంగా.. దక్షిణ మధ్య రైల్వే ఈ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ లో.. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో వినాయక నిమజ్జనం నిర్వహించనున్న నేపథ్యంలో.. ఆ రెండు రోజుల పాటు రాత్రి పూట కూడా సర్వీసులు నడపనున్నట్లు సౌత్‌సెంట్రల్‌ రైల్వే ప్రకటించింది. 

అయితే.. హైదరాబాద్‌లో తొమ్మిది రోజుల పాటు నిర్వహించే గణేష్ ఉత్సవాలు ఒక తీరు అయితే.. నిజమజ్జన కార్యక్రమం మాత్రమే మరోఎత్తు. గణేష్ నిమజ్జనాన్ని చూసేందుకు కేవలం హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న నగరవాసులే కాదు.. పక్క జిల్లాల నుంచి కూడా ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనేందుకు తరలి వస్తుంటారంటే.. నిమజ్జన కార్యక్రమం ఎంత ఘనంగా జరుగుతుందో తెలుస్తుంది.

Also Read :  ఏచూరి మృతికి మోదీ, రాహుల్ తో పాటు ప్రముఖుల సంతాపం

ట్రాఫిక్ ఆంక్షలు...

ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనాన్ని చూసేందుకు ప్రజలు ప్రత్యేకంగా ఆసక్తి చూపిస్తుంటారు.ఈ క్రమంలో.. నిమజ్జనానికి సొంత వాహనాలు కానీ, ప్రత్యేక వాహనాలు కానీ అనుమతించరు. ఆరోజున నగరంలో పెద్దఎత్తున శోభాయాత్రలు జరగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయనే సంగతి తెలిసిందే. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని.. ప్రభుత్వ రవాణా సంస్థలు అయిన.. మెట్రో, ఎంఎంటీఎస్ లాంటి సర్వీసులను ప్రజలు ఎక్కువగా వినియోగించుకోనున్నారనే సంగతి తెలిసిందే.

Also Read :  హనుమకొండ, కరీంనగర్‌ జిల్లాలను కలుపుతూ రైలుమార్గం !

ఎంఎంటీఎస్‌ ప్రత్యేక సర్వీసు..

ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న దక్షిణ మధ్య రైల్వే ఈ కీలక నిర్ణయం తీసుకుంది. జంట నగరాల ప్రజలు రాత్రి వరకు నిమజ్జన వేడుకలను చూసేందుకు వీలుగా ఎంఎంటీఎస్‌ ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు.. సెప్టెంబర్ 17, 18వ తేదీల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు.

Also Read :  పీఏసీ ప్రతిపక్షానికే ఇచ్చాం.. ఢిల్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

ఉదయం 4 గంటల వరకు...

ఉదయం 4 గంటల వరకు ఈ స్పెషల్ ట్రైన్లు సేవలు అందించనున్నాయి. 17 వ తేదీ రాత్రి 11 గంటల 10 నిమిషాలకు హైదరాబాద్‌ నుంచి లింగంపల్లి, అదే రోజు రాత్రి 11 గంటల 50 నిమిషాలకు సికింద్రాబాద్‌ నుంచి హైదరాబాద్‌ కు, 18 వ తేదీని అర్థరాత్రి 12 గంటల 10 నిమాషాలకు లింగం పల్లి నుంచి ఫలక్‌నుమా, 18 తేదీ రాత్రి 12 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్‌ నుంచి లింగంపల్లికి, 18 వ తేదీ ఉదయం 1గంట 50 నిమిషాలకు లింగంపల్లి నుంచి నుంచి హైదరాబాద్‌, 18వ తేదీన రాత్రి 02:20 గంటలకు ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్‌‌, 18వ తేదీన రాత్రి 03:30 గంటలకు హైదరాబాద్‌ నుంచి సికింద్రాబాద్, 18వ తేదీన ఉదయం 04:00 గంటలకు సికింద్రాబాద్‌‌ నుంచి హైదరాబాద్‌‌‌ కు ఈ రైలు సర్వీసులు నడుస్తాయి.

Also Read : బీఆర్‌ఎస్‌ నేతల తరలింపులో హైడ్రామా..
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు