/rtv/media/media_files/2025/04/17/ZJIuFh5LKKrrtT0b7UL2.jpg)
suprem court
BRS MLAs disqualification : భారత రాష్ట్ర సమితి పార్టీ గుర్తుపై గెలిచి ఎన్నికల తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం రేపు తేలనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధికారం కోల్పొవడంతో ఆ పార్టీకి చెందిన పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఆ పదిమందిపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ క్రమంలో మొదట హైకోర్టులో కేసు వేసిన బీఆర్‌ఎస్ అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై ఇప్పటివరకు అనేక సార్లు విచారణ సాగింది. అయితే ఈ ఘటనపై విచారణ ముగించిన కోర్టు తుది తీర్పును వాయిదా వేసింది. అయితే రేపు తుదితీర్పు ఇచ్చేందుకు సిద్దమైంది.అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం ఎమ్మెల్యేల అనర్హతపై రేపు తుది తీర్పును వెలువరించనున్నట్లు వెల్లడించారు. కోర్టులో తెలంగాణ స్పీకర్ కార్యదర్శి తరఫున న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ తన వాదనలు వినిపించగా, కౌశిక్ రెడ్డి తరఫున ఆర్యామ సుందరం వాదించారు. అయితే ఇరువురి వాదనలు ముగించిన సుప్రీంకోర్టు ఏప్రిల్ 3న తీర్పును రిజర్వు చేసింది.
ఇది కూడా చదవండి:ఘోర ప్రమాదం.. నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. అందరూ గల్లంతు!
గత విచారణలో అభిషేక్ మనుసింఘ్వీ తన వాదలను వినిపించారు. మను సింఘ్వీ మాట్లాడుతూ స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవని కోర్టు దృష్టికి ఆయన తీసుకొచ్చారు.
దీనిపై జస్టిస్ బీఆర్ గవాయ్ స్పందిస్తూ ‘మీ దృష్టిలో రీజనబుల్ టైమ్ అంటే ఏంటని సింఘ్వీని ఎదురు ప్రశ్నించారు. న్యాయవాదులు ఇలాంటి కేసుల విషయంలో వ్యవహరించే విధానం చాలా ఇబ్బందికరంగా ఉందని.అభిప్రాయ పడ్డ ఆయన సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత వారి తీరు పూర్తిగా మారిపోతోందని వ్యాఖ్యానించారు.
అదేవిధంగా అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలను ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి తరఫు న్యాయవాది ఆర్యామ సుందరం మరోసారి గుర్తు చేశారు. ‘ రాష్ర్టంలో ఉప ఎన్నికలు రావు.. స్పీకర్ తరఫున కూడా చెబుతున్నా అని’ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అసెంబ్లీలో మాట్లాడుతూ ఏ కోర్టు నుంచి అయినా రక్షణ ఉంటుందని అన్నారని గుర్తు చేశారు. దీనిపై జస్టిస్ గవాయ్ స్పందిస్తూ ‘సీఎం కనీసం స్వీయ నియంత్రణ పాటించలేరా.. ఆయన అలా వ్యవహరిస్తే ఎలా అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో అభిషేక్ మనుసింఘ్వీ మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ అంతకుమించిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు... సీఎం మాటలు కోర్టు ధిక్కారం కింద తీసుకోవాల్సి ఉంటుందని జస్టిస్ గవాయ్ హెచ్చరించారు. తాము ఇప్పటివరకు సంయమనం పాటించామని.. మిగతా రెండు వ్యవస్థలు అదే గౌరవంతో ఉండాలని సూచించారు.
ఇది కూడా చదవండి: సంచలనం రేపుతున్న ధర్మస్థల కేసు.. తవ్వకాలు మొదలు పెట్టి దర్యాప్తు చేస్తున్న సిట్