కుప్పకూలిన స్టేజ్.. ఎమ్మెల్యే యశస్విని అత్త ఝాన్సీ రెడ్డికి గాయాలు!

తొర్రూరులోని కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతి చోటుచేసుంది. స్టేజ్ కుప్పకూలడంతో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని అత్త ఝాన్సీ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. సినీనటి ప్రియాంక మోహన్ కు ప్రమాదం తప్పింది.

New Update
seeeee

MLA Yashaswini: తొర్రూరు పట్టణంలోని కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతి చోటుచేసుంది. ఈ వేడుకలో భాగంగా స్టేజ్ ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలడంతో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని అత్త, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఝాన్సీ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. షాపింగ్ మాల్ ముందు ఏర్పాటు చేసిన వేదికపై ఎక్కి ఆమె ప్రజలకు అభివాదం చేస్తుండగా ఒక్కసారిగా వేదిక కూలిపోయింది. ఇక తీవ్ర గాయాలైన ఝాన్సీ రెడ్డిని హైదరాబాద్ హాస్పిటల్ కు తరలించారు. ఆమె కాలుకు బలమైన గాయాలైనట్లు తెలుస్తోంది. ఇక ఈ షాపింగ్ ప్రారంభోత్సవానికి హానుమండ్ల ఝాన్సి రెడ్డితోపాటు సినీనటి ప్రియాంక మోహన్ హాజరయ్యారు. ప్రియాంకకు ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. 

Also Read :  'నీతో ఇక బ్రేకప్..' జెనిలియాకు భర్త రితీశ్‌ మెసేజ్.. అసలేం జరిగింది?

Advertisment
తాజా కథనాలు