మాల్ ఓపెనింగ్ లో అపశృతి.. హీరోయిన్, ఎమ్మెల్యే యశస్విని అత్తకు గాయాలు!

తొర్రూరు పట్టణ కేంద్రంలో కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. మాల్ ఓపెనింగ్ సందర్భంగా అక్కడి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టేజ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే యశస్విని అత్త ఝాన్సీ రెడ్డి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి.

New Update

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. ఈ షాపింగ్ మాల్ ఓపెనింగ్ సందర్భంగా అక్కడి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టేజ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో ఎమ్మెల్యే యశస్విని అత్త ఝాన్సి రెడ్డి కూడా ఉన్నారు. 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తొర్రూరులో  కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం జరిగింది. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హీరోయిన్ ప్రియాంక మోహన్, ఎమ్మెల్యే యశస్విని అత్త, పాలకుర్తి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి హానుమండ్ల ఝాన్సి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ ముందు ఏర్పాటు చేసిన వేదిక పై ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తుండగా వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. 

Also Read : కొండా సురేఖ సమంతను పొగిడింది.. సంచలంగా మారిన RGV ఆడియో క్లిప్

సురక్షితంగా బయటపడ్డ హీరోయిన్..

ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే యశస్విని అత్త ఝాన్సీ రెడ్డి గాయపడ్డారు. ఆమె కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చికిత్స కోసం ఆమెను హైదరాబాద్ హాస్పిటల్ కు తరలించారు. కాగా ఈ ప్రమాదం నుంచి సినీనటి ప్రియాంక మోహన్ సురక్షితంగా బయటపడ్డారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు