/rtv/media/media_files/2025/04/24/vTsWCLIYy6kLqbbavlwj.jpg)
danam nagender brs
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పార్టీ ఫిరాయింపుల వేడి రాజుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. తనపై అనర్హత వేటు పడటం ఖాయమన్న ప్రచారం జరుగుతుండగా.. దానం నేరుగా ఉపఎన్నిక కూడా సై అంటున్నారు. ఆయన ఏ పార్టీలో ఉన్నారు అనే దానిపై దానం నాగేందర్ బుధవారం స్పష్టం చేశారు. "ఇతర ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో నాకు తెలియదు కానీ, నేను మాత్రం స్పష్టంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను" అని దానం స్పష్టం చేశారు. తద్వారా ఆయన తన రాజకీయ నిర్ణయంపై వెనక్కి తగ్గబోనని తేల్చి చెప్పారు.
మాజీ మంత్రి దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. "నేను ఏ పార్టీలో ఉంటే, ఆ పార్టీ గెలుస్తుంది" అన్నారు. తాను మాత్రం కాంగ్రెస్పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేశారు. #ghmc పరిధిని #ORR వరకూ విస్తరించడంతో హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. @NagenderDanam@INCIndiapic.twitter.com/ISrPwpv1nn
— Vidya Sagar Reddy (@itz_sagarreddy) December 24, 2025
"నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది. ప్రజల ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉంటాయి" అంటూ దానం తన ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు. గెలుపు గుర్రం ఎక్కడం తనకు కొత్తేమీ కాదని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేయడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. నగరంలోని 300 డివిజన్లలో స్వయంగా ప్రచారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని వెల్లడించారు.
ప్రస్తుతం దానం నాగేందర్ అనర్హత పిటిషన్ స్పీకర్ వద్ద విచారణలో ఉంది. ఆయన వ్యాఖ్యలు త్వరలో రాబోయే ఉపఎన్నికకు సంకేతంగా కనిపిస్తున్నాయి. తనపై వేటు పడేలోపే రాజీనామా చేసి మళ్ళీ ప్రజల్లోకి వెళ్లే యోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. దానం నాగేందర్ గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ నుండి పోటీ చేసినందున, టెక్నికల్‌గా ఆయనపై అనర్హత వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. తాజాగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కేడర్‌లో ధైర్యాన్ని నింపేందుకేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఖైరతాబాద్‌లో మళ్లీ ఎన్నిక వస్తే అది కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరుకు వేదిక కానుంది.
Follow Us