Konda Surekha : ఎప్పుడు వివాదాల్లో నిలిచే మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏకంగా మంత్రుల గురించి మాట్లాడి ఆశ్చర్యపరిచారు. వివిధ పనుల నిమిత్తం తమ వద్దకు వచ్చే ఫైళ్లను క్లియర్ చేయాలంటే మంత్రులు మాములుగా డబ్బులు తీసుకుంటారని సురేఖ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. వరంగల్‌లోని కృష్ణ కాలనీ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సీఎస్‌ఆర్ నిధులు రూ.5 కోట్లతో అరబిందో ఫార్మా ఫౌండేషన్ నిర్మించిన నూతన భవనానికి సురేఖ శంకుస్థాపన చేశారు.
Also Read : కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్.. 20 మంది మావోయిస్టులు హతం..!
ఈ సందర్బంగా మాట్లాడుతూ ‘ఎంతోమంది బాలికలకు ఉన్నత విద్య అందిస్తున్న ప్రభుత్వ కాలేజీ తరగతి గదులు వర్షాకాలంలో నీళ్లు చేరి జలమయమవుతున్నాయి. ఆ గదుల్లో కూర్చోలేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. పాతది కూల్చివేసి, కొత్త భవనం కట్టాలని కలెక్టర్ కూడా నా దృష్టికి తెచ్చారు. అందుకు రూ.4.5 కోట్లు ఖర్చు అవుతాయి. అవి ఎక్కడి నుంచి తేవాలో నాకు తెలియలేదు. నేను అటవీ శాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి.. నా దగ్గరకు కొన్ని కంపెనీల ఫైళ్లు క్లియరెన్స్ కోసం వస్తుంటాయి. మామూలుగా అలాంటి ఫైళ్లు వచ్చినప్పుడు మంత్రులు డబ్బులు తీసుకుని క్లియర్ చేస్తుంటారు.
Also Read: క్రిస్టియానో రొనాల్డో కొడుకొచ్చాడు.. ఫుట్‌బాల్ ఎంట్రీ అదిరిపోయింది
అలా వచ్చిన సందర్భంలో నేను వాళ్లతో అన్నా.. మాకు ఒక్క నయాపైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇచ్చే డబ్బులతో సమాజ సేవ చేయండి. మా ప్రాంతంలో ఒక స్కూల్‌డెవలప్ చేయండి. మీ పేరు గుర్తుండి పోతుందని చెప్పా. అప్పుడు మా చేతుల్లో ఏమీ లేదు.. పై వాళ్లతో మాట్లాడతామని అరబిందో ఫార్మాకు చెందిన సదానంద రెడ్డి చెప్పారు. చివరకు సీఎస్‌ఆర్ నిధులు రూ.4.5 కోట్లతో కాలేజీ భవనం కడతామని చెప్పినప్పుడు నాకు సంతోషం కలిగింది’’ అని మంత్రి సురేఖ వ్యాఖ్యానించారు. ఆ నిధులతో గ్రౌండ్‌తో పాటు, రెండంతస్థులతో 15 తరగతి గదులు, ఆడిటోరియం,పెద్ద హాల్, 60 అధునాతన టాయిలెట్లు, నూతన ఫర్నిచర్ విద్యార్థినులకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కాగా మంత్రి సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలతో ఆశ్చర్యపోవడం అక్కడ ఉన్నవారి వంతయింది. అంతేకాక మంత్రులంతా డబ్బులు తీసుకుంటారనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్లయింది.
Also Read: ఏపీలో ఘోర విషాదం.. ఈతకు వెళ్లిన చిన్నారులు గల్లంతు.. లభించని ఆచూకీ!
Konda Surekha : పైసలిస్తేనే ఫైళ్ల పై మంత్రుల సంతకాలు...కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
ఎప్పుడు వివాదాల్లో నిలిచే మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. వివిధ పనుల నిమిత్తం తమ వద్దకు వచ్చే ఫైళ్లను క్లియర్ చేయాలంటే మంత్రులు మాములుగా డబ్బులు తీసుకుంటారని సురేఖ వ్యాఖ్యానించారు. తను మాత్రం కాలేజీ భవనం కట్టామన్నానన్నారు.
konda surekha