గురుకుల విద్యార్థులకు ఆ సదుపాయాలు అందించాలి: మంత్రి పొన్నం

గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు అందించేందుకు కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. 

Ponnam Prabhakar
New Update

గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు అందించేందుకు కృషి చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఎంజేపీ రెసిడెన్షియల్ స్కూల్స్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అధికారులతో సెక్రటేరియట్‌లో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. గత 4 బోర్డు ఆఫ్ గవర్నెన్స్‌లో తీసుకున్న నిర్ణయాల్లో అమలు అయినటువంటి పనులు, అలాగే పెండింగ్ పనులపై మంత్రి పొన్నం అధికారులను ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. బీసీ విద్యార్థులకు మెరుగైన విద్య అవకాశాలు కల్పించేలా ప్రస్తుతం ఉన్న రెండు సీఈఓల సంఖ్యను పదికి పెంచుతున్నట్లుగా తెలిపారు.  ఐఐటీ, ఎన్ఐటీ, నీట్‌లో ఇచ్చే శిక్షణను మరింత అందించేలా ఇది ఉపయోగపడనుందని చెప్పారు.

Also Read: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. డిప్యూటీ కలెక్టర్లు బదిలీ

ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి

ప్రస్తుతం విద్యార్థులకు ఇస్తున్న రెండు స్కూల్ డ్రెస్సులు, ఒక స్పోర్ట్స్ డ్రెస్‌తో పాటుగా రెండు నైట్ డ్రెస్సులు కూడా ఇవ్వాలని గవర్నర్స్ మీటింగ్‌లో ఆమోదించారు. 90 ప్రాంతాల్లో ఉన్న 104 గురుకుల విద్యాసంస్థల్లో ఆర్‌ఓ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి గురుకుల విద్యాసంస్థల్లో సోలార్ వాటర్ హీటర్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని హైజేనిక్ కిచెన్‌తో పాటుగా స్కూల్ ఆవరణలో పరిశుభ్రత పాటించాలని మంత్రి సూచించారు.  గురుకుల విద్యా సంస్థల్లో 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు నవోదయ మాదిరి నేరుగా ఇంటర్‌లోకి చేరేందుకు పర్మిషన్ కూడా ఇచ్చారు. 

ఇంటర్మీడియట్ బోర్డుతో అనుసంధానం చేసుకొని విద్యార్థులకు ఉపాధి కల్పించేలా అనేక వృత్తి విద్య కోర్సులను ప్రారంభించాలని మంత్రి సూచించారు. డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్న అధ్యాపకులకు సర్వీస్ రూల్స్‌ను వర్తింపచేయాలని నిర్ణయించారు. వచ్చే వంద రోజుల తరువాత జరిగే సమావేశంలో సర్వీస్ రూల్స్ ఆమోదించుకోవాలని సూచించారు. అన్ని గురుకులాల్లో బుష్ క్లియరెన్స్ చేయాలని ఆదేశించారు. అలాగే తెల్ల ఉసిరి పెంచితే పాములు రాకుండా ఉంటాయని వాటిని పెంచాలని తెలిపారు.   

Also Read: గ్రూప్ 1 మెయిన్స్ ఎంపికైన వారిలో బీసీలు, ఎస్సీలు ఎంతమందో తెలుసా ?

విద్యార్థులకు క్రీడలపై మరింత దృష్టి సారించేలా, కల్చరల్ యాక్టివిటీస్, ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్‌పై మరింత శ్రద్ధ వహించాలని సూచించారు. మరోవైపు  రెసిడెన్షియల్ స్కూల్స్‌కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అత్యవసరమైనవని వాటిని అందించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం ఆదేశించారు. డ్రింకింగ్ వాటర్ ఆర్వోస్ ప్లాంట్‌లు పూర్తి చేయాలని.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గురుకులాల్లో కిచెన్‌లపై ఒక నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వాష్ రూంలో ఉన్న సమస్యలు పూర్తి చేయాలని సూచించారు. ఇక ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశంతో పాటు ఎంజేపీ స్కూల్ సెక్రటరీ బడుగు సైదులు, జాయింట్ సెక్రెటరీ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. 

 

#telugu-news #telangana #Minister Ponnam Prabhakar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe