/rtv/media/media_files/2025/01/13/9pJUXeAU4onsooQfE1At.jpg)
inter students Photograph: (inter students)
తెలంగాణలోని ఇంటర్ స్టూడెంట్స్కు రేవంత్ సర్కార్ త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే ఫస్ట్ ఇయర్, సెంకడియర్ స్టూడెంట్లకు మిడ్డే మీల్స్ పెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ స్కీమ్ ను వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయాలని సర్కార్ డిసైడ్ అయింది. ఈ స్కీమ్ అమలు కోసం ఇంటర్మీడియెట్ కమిషనరేట్ అధికారులు ప్రతిపాదనలు కూడా రెడీ చేశారు. త్వరలో ప్రభుత్వానికి అందజేయనున్నారు.
తెలంగాణలో ప్రస్తుతం 425 ప్రభుత్వ జూనియర్ కాలేజీలున్నాయి. ఇందులో 1.30 లక్షల మంది వరకూ స్టూడెంట్స్ చదువుతున్నారు. ఇందులో చదివేవారంతా పేద విద్యార్థులే కావడం పైగా దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు కావడంతో మధ్యాహ్నం భోజనం లేక ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో అడ్మిషన్లు కూడా తగ్గిపోవడం, ఉన్న స్టూడెంట్లు కూడా సరిగ్గా రాకపోవడంతో అటెండెన్స్ తగ్గిపోతుంది. దీనిపై సర్కారు పెద్దలు ఆరా తీయగా.. దీనికి మిడ్డే మీల్స్ లేకపోవడం కూడా ఓ కారణంగా అధికారులు చెప్పుకొచ్చారు.
వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి
దీనిపై సానుకూలంగా స్పందించిన సర్కార్ వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి మిడ్డే మీల్స్ పెట్టాలని నిర్ణయించింది. అయితే ఈ స్కీమ్ ను అమలు చేయాలంటే ఏటా రూ. 120 కోట్లు అవసరం పడుతుంది. ఒక్కో విద్యార్థికి ఒక పూటకు కనీసం రూ.20 నుంచి రూ.23 దాకా ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన చూసుకుంటే ఏడాదికి సుమారుగా రూ. 120 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ లెక్కలను త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నారు.
అయితే ఈ మిడ్డే మీల్స్ స్కీమ్ అమలుకు కార్మికులను నియమించాలా లేక అక్షయపాత్ర, మన్నా ట్రస్ట్ లాంటి స్వచ్ఛంద సంస్థలకు బాధ్యతలు అప్పగించాలా అనే దానిపై కసరత్తులు నడుస్తున్నాయి. అన్ని కుదిరితే 2025-26 బడ్జెట్లో సర్కారు జూనియర్ కాలేజీల్లో మిడ్డేమీల్స్ పెట్టేందుకు నిధులు కేటాయించే అవకాశం ఉంది.
కాగా ఇదే స్కీమ్ ను గత బీఆర్ఎస్ సర్కారు అమలు చేయాలని అనుకుంది. 2018లో అప్పటి విద్యాశాఖ మంత్రి నేతృత్వంలో ఓ కమిటీ కూడా వేశారు. అయితే ఈ కమిటీ ఒక్క జూనియర్ కాలేజీల్లోనే కాకుండా డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ ఇలా అన్ని కాలేజీల్లో మిడ్డేమీల్స్ అమలు చేస్తామని ప్రకటించింది. కానీ స్కీమ్ ను మాత్రం కేసీఆర్ సర్కార్ ప్రారంభించలేకపోయింది.
Also Read : Bhogi: పెద్ద పండుగ తొలి రోజు భోగి మంటలు ఎందుకు వేస్తారో తెలుసా!