హైదరాబాద్ వాసులకు అదిరిపోయే శుభవార్త.. సర్కార్ కొత్త స్కీమ్!

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నీటి వినియోగదారులకు మెట్రోవాటర్ గుడ్‌న్యూస్ చెప్పింది. నల్లా బిల్లుల బకాయిలు ఉన్నవారు ఈ నెల 31వ తేదీలోపు ఎలాంటి వడ్డీ, ఆలస్య రుసుం చెల్లించకుండానే వన్‌టైం సెటిల్మెంట్ (OTS) చేసుకునేలా అవకాశం ఇచ్చింది.

hyderabad 2
New Update

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నీటి వినియోగదారులకు మెట్రోవాటర్ గుడ్‌న్యూస్ తెలిపింది. నల్లా బిల్లుల బకాయిలు ఉన్నవారు ఈ నెల 31వ తేదీలోపు ఎలాంటి వడ్డీ, ఆలస్య రుసుం చెల్లించకుండానే వన్‌టైం సెటిల్మెంట్ (OTS) చేసుకునేలా అవకాశం ఇచ్చింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వాటర్‌ బోర్డుపై బకాయిల భారం రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ఓటీఎస్‌ను  అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో వాటర్‌ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి వెల్లడించారు. సెప్టెంబర్ 19న ప్రభుత్వానికి లెటర్ రాశామని.. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇచ్చిందని తెలిపారు. గతంలో కూడా రెండుసార్లు వాటర్‌బోర్డు ఇలా వన్‌టైం సెటిల్‌మెంట్‌ను అమలు చేసిందని పేర్కొన్నారు.  

వీళ్లకి మాత్రమే ఛాన్స్

మరో విషయం ఏంటంటే నల్లా కనెక్షన్ యాక్టివ్‌లో ఉన్న వారికి మాత్రమే ఈ ఓటీఎస్‌ వర్తిస్తుందని.. అది కూడా బకాయి మొత్తం ఒకేసారి చెల్లించాలని అధికారులు చెబుతున్నారు. ఎవరైతే కనెక్షన్‌ను డిస్‌ కనెక్ట్‌ చేసుకుంటారో వారికి ఈ ప్రయోజనం వర్తించదని తెలిపారు. ఒకవేళ కనెక్షన్ లేనివారు ఓటీఎస్ ప్రయోజనం పొందాలనుకుంటే భవిష్యత్తులో 24 నెలలపాటు తప్పకుండా బిల్లులు చెల్లిస్తామని అఫిడవిట్ రాయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఒకవేళ బిల్లు చెల్లించకపోతే.. ఒటీఎస్‌ కింద వారు పొందిన ప్రయోజనాన్ని రద్దు చేస్తామని స్పష్టం చేశారు.  

ఎవరి దగ్గరికి వెళ్లాంటే 

నల్లా బిల్లుల బకాయిలను బట్టి వినియోగదారులు అధికారుల వద్దకు వెళ్లాలి. రూ.2 వేల వరకు ఉంటే మేనేజర్‌ దగ్గరికి, రూ.2001 నుంచి రూ.10వేల మధ్య ఉంటే డిప్యూటీ జీఎం, రూ.10,001 నుంచి రూ.10,000 లోపు ఉంటే జనరల్ మేనేజర్ వద్దకు వెళ్లాలి. ఒకవేళ రూ.లక్ష కన్నా ఎక్కువగా ఉండే చీఫ్‌ జీఎంను కలవాల్సి ఉంటుంది. 

#telugu-news #hyderabad #water
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe