/rtv/media/media_files/2025/02/25/aGN3Sgk6k1y7dPhiyTZ5.jpg)
JOB MELA 2025
మీరు జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా?.. కానీ ఎక్కడా దొరకకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారా?.. అయితే ఇది మీకోసమే. కూకట్ పల్లి జేఎన్టీయూ జాబ్స్ కోసం ట్రై చేస్తున్న నిరుద్యోగుల కోసం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులో బాగంగా భారీ జాబ్ మేళా నిర్వహించడానికి సిద్ధమైంది.
Also Read: తమిళనాడులో హిందీ భాష వివాదం.. బోర్డులపై నల్ల రంగు పూస్తున్న డీఎంకే కార్యకర్తలు
మార్చి 1న
మార్చి 1న జేఎన్టీయూ యూనివర్సిటీలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తుంది. ఈ విషయాన్ని యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ కిషన్ కుమార్ రెడ్డి తాజాగా వెల్లడించారు. దీనికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. యూనివర్సిటీ ఇండస్ట్రీ ఇంట్రాక్షన్ అండ్ నిపుణ హ్యూమన్ డెవలప్‌మెంట్ సొసైటీ, HR కో ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నారు.
Also Read: మహా కుంభమేళా పై రాంగ్ న్యూస్... 140 సోషల్ మీడియా అకౌంట్ల పై కేసు నమోదు!
1000కి పైగా ఉద్యోగాలు
ఈ మెగా జాబ్ మేళాలో దాదాపు 1000కి పైగా ఉద్యోగాలు దక్కనున్నాయి. ముఖ్యంగా మహిళలకు అధికంగా అందించాలనే కార్యాచరణతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. అందువల్ల నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి జాబ్ సాధించాలని వారి కోరారు.
Also Read: అల్లు అర్జున్ అంటే పిచ్చి.. అతడితో ఆ సీన్‌లలో అయినా ఓకే: టాలీవుడ్ హీరోయిన్!
జీతం వివరాలు
ఇక ఈ మెగా జాబ్ మేళాలో 100కు పైగా కంపెనీ ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ జాబ్‌లకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఊహించని సాలరీ అందుకోనున్నారు. రూ.1.08 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ప్యాకేజీ అందుకోవచ్చు. అందువల్ల నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.