మేడిగడ్డలో లోపాలు.. ఆ బ్లాక్‌ మళ్లీ నిర్మించాల్సిందే .. ఎన్డీఎస్‌ఏ సంచలన రిపోర్ట్

మేడిగడ్డ బ్యారేజీలో ప్లానింగ్ నుంచి నిర్వహణ వరకు లోపాలు ఉన్నట్లుగా నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్‌ఏ) గుర్తించింది. మేడిగడ్డ బ్యారేజ్‌ లోని ఏడో బ్లాక్‌ కూల్చాల్సిందేనని  ఇప్పటికే సిఫార్సు చేసిన  ఎన్డీఎస్‌ఏ మళ్లీ నిర్మించాలని సూచించింది.

New Update
medigadda

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో ప్లానింగ్ నుంచి  నిర్వహణ వరకు లోపాలు ఉన్నట్లుగా నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్‌ఏ) గుర్తించింది. మేడిగడ్డ బ్యారేజ్‌ లోని ఏడో బ్లాక్‌ కూల్చాల్సిందేనని  ఇప్పటికే సిఫార్సు చేసిన  ఎన్డీఎస్‌ఏ మళ్లీ నిర్మించాలని సూచించింది. అయితే   ఈ బ్లాకును మళ్లీ నిర్మించేందుకు అవసరమైన డిజైన్‌ను రూపొందించే బాధ్యతను కేంద్ర జలసంఘానికి(సీడబ్ల్యూసీ) అప్పగించాలని సూచించినట్టుగా తెలుస్తోంది.    కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ రెండు వారాల క్రితమే రిపోర్టును అందజేయగా దీనిపై  మూడ్రోజుల క్రితం కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ చర్చించినట్లు సమాచారం. ఇందులోని ముఖ్యమైన అంశాలను  ఎన్డీఎస్‌ఏ, జలసంఘం, జల్‌శక్తి అధికారులకు చంద్రశేఖర్‌ అయ్యర్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించినట్లు సమాచారం.  

చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలో 

2023 అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజీ కుగింది. దీంతో ఏడో బ్లాక్ పాటు కొన్ని పియర్స్‌ దెబ్బతిన్నాయి. ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీ పరిశీలించి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌లో వైఫల్యాల వల్ల దెబ్బతిన్నట్లుగా గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు గతేడాది మార్చి 2న చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఎన్డీఎస్‌ఏ నియమించింది.  బ్యారేజీలను అధ్యయనం చేసి వాటి పరిస్థితిని అంచనా వేసి ఏయే చర్యలు తీసుకోవాలో సిఫార్సు చేయాలని కోరింది.  మేడిగడ్డతో పాటుగా కాళేశ్వరంలోని మిగితా అన్నారం, సుందిళ్లను కూడా అధ్యయనంలో చేర్పించింది. ఈ కమిటీ  2024 మే1న ప్రాథమిక నివేదిక ఇచ్చింది. బ్యారేజీలలో నీటిని నిల్వ చేయకుండా గేట్లు తెరిచి ఉంచాలని, పలు పరీక్షలు చేయించాలని సూచించింది. 

మేడిగడ్డ బ్యారేజీకు సంబంధించి అన్ని పరీక్షలు పూర్తి అయ్యాక పలు సిఫార్సులతో తుది నివేదికను ఇచ్చింది. బ్యారేజీల పరిస్థితి, వైఫల్యాలకు కారణాలు, తదుపరి తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ నివేదికలో పొందుపరిచింది. నివేదికలో   డిజైన్, నిర్మాణం, నిర్వహణలో లోపాలున్నాయని, మేడిగడ్డ ఏడో బ్లాక్‌ను తొలగించి మళ్లీ నిర్మించాల్సి ఉంటుందని నివేదికలో వెల్లడించింది.  అంతేకాకుండా మేడిగడ్డ బ్యారేజీ కాలమ్స్‌లోనూ లోపాలున్నట్లు గుర్తించిన కమిటీ..   బ్యారేజీ పైభాగంలో సీకెంట్‌ పైల్స్‌ నాణ్యత కూడా సరిగా లేదని అభిప్రాయపడింది. తుది నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందిన తర్వాతనే పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే   అవకాశం ఉంది.

Also read :   Asha Workers: ఆశా వర్కర్లకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా..!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు