Hyderabad: కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చిన యువతితో ఎస్ఐ ప్రేమ.. ఆపై అత్యాచారం!
ఓ కేసు విషయంలో కంప్లైంట్ చేసేందుకు వచ్చిన ఓ యువతితో ఎస్ఐ పబ్బా అరుణ్ ప్రేమ వ్యవహారం నడిపాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు. ప్రస్తుతం సిద్దిపేట కమిషనరేట్ వీఆర్‌లో పనిచేస్తున్న ఎస్సై అరుణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.