Fire Accident : సంగారెడ్డి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం..
సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బొంతపల్లి పారిశ్రామిక వాడలోని స్క్రాప్ గోదాములో మంటలు చెలరేగాయి. కెమికల్ డ్రమ్ములు నిల్వ ఉండటంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి.
సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బొంతపల్లి పారిశ్రామిక వాడలోని స్క్రాప్ గోదాములో మంటలు చెలరేగాయి. కెమికల్ డ్రమ్ములు నిల్వ ఉండటంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి.
TG: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ మర్చిపోయిందని అన్నారు హరీష్ రావు. హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఫైర్ అయ్యారు. ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని అన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల నిర్మాణాలపై కాంగ్రెస్ అవగాహన లేకుండా మాట్లాడుతోందని ఫైర్ అయ్యారు హరీష్ రావు. టీమ్స్ ఆస్పత్రుల పట్ల మంత్రి కోమటిరెడ్డి అవగాహన లేకుండా మాట్లాడటం దురదృష్టకరం అని అన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సదుపాయాలు పెంచాలని అన్నారు.
TG: ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రి కొనసాగుతారని జగ్గారెడ్డి అన్నారు. రేవంత్ ను సీఎం పదవిలో నుంచి దించేందుకు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదన్నారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పారు.
ఈవీఎంలను పగలగొట్టిన ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం ఏపీ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నాయి. అయితే.. ఇప్పటికే ఆయన గన్ మెన్, డ్రైవర్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరో వైపు పిన్నెల్లి సోదరులు కూడా పోలీసులకు చిక్కినట్లు వార్తలు వస్తున్నాయి.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి ఎస్సైగా పనిచేస్తు్న్న నాగరాజు భార్య మానస.. పీఎస్ ముందు ఆందోళనకు దిగారు. తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధంలో ఉన్నాడని ఆరోపించారు. విడాకులు ఇవ్వాలంటూ నిత్యం తనను వేధిస్తున్నాడని వాపోయారు.
TG: బీఆర్ఎస్ ఇక ఉండదు అంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు విజయశాంతి. దక్షిణాది రాష్ట్రాలకు ప్రాంతీయ పార్టీలే ఊపిరి అని బీఆర్ఎస్ కు మద్దతుగా ట్వీట్ చేశారు. దీంతో ఆమె త్వరలో కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరుతారనే చర్చ రాజకీయాల్లో మొదలైంది.
వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బసవేశ్వర్నగర్లో దారుణం జరిగింది. నీలందత్తు, లావణ్య దంపతుల ఐదు నెలల కొడుకు.. వాళ్లు పనిచేస్తున్న నాగభూషణం పాలిషింగ్ పరిశ్రమ యజమానికి చెందిన కుక్క దాడిలో మృతి చెందడం కలకలం రేపింది.