VRO వ్యవస్థపై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆ 11 వేల మందికి బాధ్యతలు! తెలంగాణలో వీఆర్వో వ్యవస్థను మళ్లీ తీసుకురావాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. దీంతో దాదాపు 11 వేల గ్రామాలకు వీఆర్వోలు రానున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. By Nikhil 01 Dec 2024 in తెలంగాణ రాజకీయాలు New Update షేర్ చేయండి బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిన వీఆర్వో వ్యవస్థను మళ్లీ తీసుకురావాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఆ వ్యవస్థ ద్వారా భారీగా అవినీతి జరుగుతోందని.. భూ రికార్డుల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని గత ప్రభుత్వం రద్దు చేసింది. ఆయా ఉద్యోగాల్లో పని చేస్తున్న దాదాపు 12 వేల మందిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. అయితే.. ప్రస్తుత రేవంత్ రెడ్డి సర్కార్ ఆ వ్యవస్థను మళ్లీ తీసుకురావాలని భావిస్తోంది. ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించడానికి ఏర్పాట్లు చేస్తోంది. దీంతో రాష్ట్రంలోని మొత్తం 10,909 గ్రామాలకు వీఆర్వోలు రానున్నారు. ఇది కూడా చదవండి: చెక్ పవర్ రద్దు.. కలెక్టర్లకు ఆ అధికారం కట్.. పంచాయతీ రాజ్ చట్టంలో రానున్న మార్పులివే! కొత్తగా 8 వేల నియామకాలు.. దాదాపు 11 వేల మంది వీఆర్వోలను ప్రభుత్వం నియమించాల్సి ఉండగా.. ఇందులో గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకం అయిన వారికి నేరుగా బాధ్యతలు అప్పగించనున్నారు. దీంతో 3 వేల మందిని వివిధ శాఖల నుంచి నియమించనుంది ప్రభుత్వం. ఇంకా నియమాక పరీక్ష నిర్వహించి మరో 8 వేల మందిని నియమించనుంది ప్రభుత్వం. గత ప్రభుత్వ హాయంలో వీఆర్వోలు, వీఆర్‌ఏలుగా పనిచేసి.. వివిధ శాఖల్లోకి పంపించిన వారిలో ఇంటర్, డిగ్రీ చేసిన వారిని తొలుత గుర్తించనున్నారు. వారికి రెవెన్యూ సేవలు, అంశాలనే సిలబస్ గా పరీక్ష నిర్వహించనున్నారు. అందులో నుంచి మెరిట్ ఆధారంగా వీఆర్వోలను నియమించనున్నారు. ఇది కూడా చదవండి: Job Notification: తెలంగాణలో ఆ ఉద్యోగ నోటిఫికేషన్ రద్దు.. న్యాయ పరమైన చిక్కులు రాకుండా.. అయితే.. నియామకాల సందర్భంగా ఎలాంటి చిక్కులు రాకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందుకోసం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు? గతంలో రెవెన్యూ శాఖకు సంబంధించిన అనేక ధృవీకరణ పత్రాలు వీఆర్వోల ద్వారానే జారీ అయ్యేవి. ఇంకా భూరికార్డుల బదలాయింపులోనూ వీరి పాత్ర ఉండేది. అయితే.. ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చే వీఆర్వో వ్యవస్థలో ఎలాంటి మార్పులు ఉంటాయి? పాత అధికారాలే వారికి ఉంటాయా? అన్న అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి