/rtv/media/media_files/2025/10/18/katta-ramchandra-reddy-2025-10-18-11-15-56.jpg)
Katta Ramchandra Reddy
Katta Ramchandra Reddy : ఇటీవల ఛత్తీస్ గఢ్ ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఖాతా రాంచంద్రారెడ్డి అంత్యక్రియలు మరికొద్ది సేపట్లో జరగనున్నాయి. ఆయన మృతదేహన్ని ఆయన స్వగ్రామమైన సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం తీగలకుంటపల్లికి తీసుకువచ్చారు. ఈ ఉదయం గ్రామంలో అంతిమయాత్ర అశ్రునయనాల మధ్య కొనసాగింది. ఖాతా (కట్ట) రామచంద్రారెడ్డి ఛత్తీస్ గఢ్ నారాయణపూర్ జిల్లాలోని అబుజ్ మాడ్ అడవుల్లో ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే.
రాంచంద్రారెడ్డి మొదట సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో పని చేశారు. అనంతరం వరుకోల్ గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తూ1989లో నాటి పీపుల్స్‌వార్ తో ఏర్పడిన పరిచయంతో అజ్ఞాతంలోకి వెళ్లపోయారు. మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన నక్సల్స్ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. సాధారణ సభ్యుడిగా పీపుల్స్ వారిలో చేరిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర కమిటీ సభ్యుడుగా ఎదిగారు. ఇటీవల అబుజ్ మాడ్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు. దాదాపు నెల రోజుల క్రితం ఎన్‌కౌంటర్ జరిగి కట్టా మరణించగా, ఆయన మరణంపై అనుమానం ఉందని రీపోస్ట్ మార్టం చేయాలంటూ కుటుంబ సభ్యులు ఛత్తీస్‌గడ్ హైకోర్టును ఆశ్రయించారు.
కాగా హైకోర్టు తీర్పు ఆలస్యం కావడంతో అక్కడే రామచంద్రారెడ్డి అంత్యక్రియలు పూర్తి చేయాలని ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం భావించింది. అయితే హైకోర్టు నిర్ణయం వెలువడే వరకు మృతదేహాన్ని భద్రపరచాలని సుప్రీంకోర్టును రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు ఆశ్రయించారు.దీంతో హైకోర్టు తీర్పు వచ్చే వరకు డెడ్ బాడీని కాపాడాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రీ పోస్ట్ మార్టం అప్పీల్‌ను హైకోర్టు తిరస్కరించడంతో నెల రోజుల తర్వాత స్వగ్రామానికి రామచంద్రారెడ్డి మృతదేహం తీసుకు వచ్చారు. ఈ రోజు ఉదయం తీగలకుంట పల్లిలో పలువురు కుటుంబ సభ్యులు, ఉద్యమాభి మానులు, ప్రజాసంఘాల నేతల సమక్షంలో రామచంద్రారెడ్డి అంతిమ యాత్ర, అంత్యక్రియలు జరిగాయి.
Also Read: పిచ్చి వేషాలు వేస్తే...లోపలికి వెళ్ళి మరీ చంపేస్తాం..హమాస్‌ను హెచ్చరించిన ట్రంప్