లగ్జరీ వాచ్‌లు కొన్న పొంగులేటి కొడుకు.. వాటి ప్రత్యేకతలు ఏంటంటే ?

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది.ఆయన కొడుకు హర్షారెడ్డి కొనుగోలు చేసిన కోట్లాది రూపాయల ఖరీదైన పాటెక్‌ ఫిలిప్స్‌, బ్రెగ్యుట్‌ లగ్జరీ వాచ్‌లకు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. 

Luxary Watch
New Update

తెలంగాణలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఆయన కొడుకు హర్షారెడ్డి ఇటీవల కోట్లాది రూపాయల విలువైన పాటెక్ ఫిలిప్, బ్రెగ్యూట్ బ్రాండ్ లాంటి బ్రాండ్‌ వాచ్‌లను కొనుగోలు చేశాడు. విదేశాల నుంచి తెప్పిస్తుండగా.. ఫిబ్రవరి 5న స్మగ్లర్ అయిన మహమ్మద్ ఫహెర్దీన్ ముబీన్‌ చెన్నై కస్టమ్స్‌ అధికారులకు చిక్కాడు. విచారణలో పొంగులేటి కొడుకు హర్షా రెడ్డియే ఈ వాచ్‌లు తెప్పించినట్లు ముబీన్ అంగీకరించాడు. రూ.35 కోట్లు విలువ చేసే 7 వాచ్‌లను హర్షారెడ్డి కొనుగోలు చేశాడని తాజాగా జరిపిన సోదాల్లో బయటపడ్డట్లు తెలుస్తోంది. ఇందులో ఒక్కో వాచ్‌ ధర విలువ రూ.5 కోట్లుగా ఉన్నట్లు సమాచారం.ఈ వాచ్‌లను సన్నిహితులకు, మిత్రులకు హర్షారెడ్డి ఇచ్చినట్లు సమాచారం.

Also Read: గ్రూప్​-1 అభ్యర్థులకు షాక్.. పరీక్ష మళ్లీ రద్దు అవుతుందా?

హర్షారెడ్డి కొనుగోలు చేసిన కోట్లాది రూపాయల ఖరీదైన పాటెక్‌ ఫిలిప్స్‌ 5740, బ్రెగ్యుట్‌ 2759 లగ్జరీ వాచ్‌లకు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. బంగారం పూతతో పాటెక్‌ ఫిలిప్స్‌ వాచీ ముల్లులు తయారీ చేశారు. క్యాలెండర్‌, స్పోర్ట్స్‌ అప్పీల్, టెక్నికల్ సొఫిస్టికేషన్ అనేవి ఈ వాచ్‌ ప్రత్యేకతలు.అలాగే తెల్ల బంగారంతో దీన్ని తయారు చేశారు. బంగారంతో పాటు నికెల్, పెల్లాడియం లేదా సిల్వర్‌ లోహాల మిశ్రమంతో తెల్ల బంగారాన్ని తయారుచేస్తారు. ఇక ఈ పాటెక్ ఫిలిప్స్‌ గడియారం మందం 3.88 మిల్లీ మీటర్లు కాగా.. ఇందులో 27 ఆభరణాలు ఉన్నాయి. 

బ్రెగ్యూట్‌ 2759 వాచ్‌ను 1775లో తయారు చేశారు. ప్యారిస్‌లో అబ్రహం లూయిస్ అనే వ్యక్తి ఈ వాచ్‌ను రూపొందించారు. రోజ్‌గోల్డ్, వైట్‌ గోల్డ్‌తో దీన్ని తయారు చేశారు. 1783లో ఫ్రాన్స్‌ రాణి మేరీ ఆంథోనికి బ్రెగ్యూట్‌ వాచీని అబ్రహం లూయిస్ బహుమతిగా ఇచ్చారు. దీన్ని 1983లో జెరుసలేంలోని ఇస్లామిక్ ఆర్ట్ మ్యూజియంలో ఉంది. ప్రస్తుతం ఈ బ్రెగ్యూట్ వాచ్ ధర న్యూయార్క్‌లో 6.8 మిలియన్ డాలర్లుగా ఉంది. 

 

 

#telangana #minister-ponguleti-srinivas #telangana-politcs #smuggling
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe