వీడెవడండీ బాబు.. మందు పార్టీకోసం మంత్రి పొన్నంకి లేఖ!

మందుపార్టీ అనుమతి కోసం ఓ వ్యక్తి మంత్రి పొన్నం ప్రభాకర్‌కు రాసిన లేఖ వైరల్ అవుతోంది. రాష్ట్రంలో మొన్న జరిగిన కొన్ని పరిణామాల వల్ల స్నేహితులం కలిసి పార్టీ చేసుకుందాం అంటే భయం వేస్తుంది. తమ యందు దయతలచి ఎక్కడ అనుమతి తీసుకోవాలో చెప్పండి అంటూ రాసుకొచ్చారు.

Minister Ponnam Prabhakar
New Update

రాష్ట్రవ్యాప్తంగా జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారం సంచలనం సృష్టించింది. రాజ్ పాకాల ఇంట్లో పార్టీ జరుగుతుండగా పోలీసులు దాడి చేశారు. అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించారని.. అంతేకాకుండా విదేశీ మద్యంకి సంబంధించి ఎలాంటి బిల్లులు లేకపోవడంతో కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.

Also Read :  చిరంజీవి Vs మోహన్ బాబు.. నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్న ఫ్యాన్స్

ఒకరిద్దరు కలిసి మద్యం తాగితే ఒకే

ఇలాంటి సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ‘‘ఒకరిద్దరు కలిసి మద్యం తాగితే ఒకే.. కానీ ఎక్కువ మంది కలిసి తాగేటట్లు అయితే ఎక్సైజ్ శాఖ అనుమతి తీసుకోవాలి. రాజా పాకాల ఇంట్లో మద్యం తాగడానికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. అందువల్లనే వారిపై కేసులు పెట్టారు’’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడినట్లు ఓ వార్త చక్కర్లు కొడుతుంది. 

Also Read :  చిరంజీవి Vs మోహన్ బాబు.. నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్న ఫ్యాన్స్

మంత్రి పొన్నం ప్రభాకర్‌కు లేఖ

దీంతో కొందరు మందు ప్రియులు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాని ప్రకారం.. ‘‘మంత్రి పొన్నం గారు నేను, నా స్నేహితులం కలిసి ప్రతి వారం అంటే నెలలో ప్రతి ఆదివారం మద్యం సేవిస్తాం. అయితే ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే.. దానికి ఓ బలమైన కారణం ఉంది.

Also Read :  గుంతల రోడ్డుపై యముడి లాంగ్‌జంప్‌ పోటీలు

రాష్ట్రంలో మొన్న జరిగిన కొన్ని పరిణామాల వల్ల స్నేహితులం కలిసి పార్టీ చేసుకుందాం అంటే భయం వేస్తుంది. పక్కాగా అనుమతి తీసుకోవాలని మీరు సూచించడం మాకు చాలా ఆందోళన కలిగిస్తుంది. కాబట్టి మా యందు దయతలచి ఎక్కడ అనుమతి తీసుకోవాలో చెప్పండి.

Ponnam Prabhakar

Also Read :  మా సినిమా కూడా సంక్రాతికే..కానీ? 'తండేల్' రిలీజ్ పై డైరెక్టర్ అప్డేట్

ముఖ్యమంత్రి దగ్గరా? లేదా మీ వద్దనా? లేదా ఎక్సైజ్ శాఖ వద్దనా? ఏదో ఒక క్లారిటీ ఇస్తే మేము, మా స్నేహితులందరం కలిసి అనుమతి తీసుకుని పార్టీ చేసుకుంటామని కోరుతున్నాం.. ఇట్లు మీ తెలంగాణ వాసి’’ అంటూ ఆ లేఖలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆ లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.

#Minister Ponnam Prabhakar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe