Blue Pinkgill Mushroom: విషపూరితమైన మష్రూమ్‌ని చూశారా..? దీనిని తినోచ్చా.. లేదా తేలుసుకోండి!!

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కనకగిరి అడవుల్లో ఇటీవల నీలి రంగు పుట్టగొడుగులు కనిపించింది. ఈ అరుదైన పుట్టగొడుగులు న్యూజిలాండ్‌కు చెందిన బ్లూ పింక్ గిల్ లేదా స్కై బ్లూ మష్రూమ్ ( ఎంటోలోమా హోచ్‌స్టెట్టెరి) జాతికి చెందినవిగా గుర్తించారు.

New Update
Blue Pinkgill Mushroom

Blue Pinkgill Mushroom

Blue Pinkgill Mushroom: పుట్టగొడుగులు ఒక రకమైన ఫంగస్. శాస్త్రీయంగా ఇవి శిలీంధ్ర రాజ్యానికి చెందినవి. ఇవి సాధారణంగా తక్కువ సూర్యరశ్మి ఉండే తేమతో కూడిన ప్రదేశాలలో పెరుగుతాయి. భూమిపై సుమారు 14 వేల రకాల పుట్టగొడుగులు ఉన్నాయి. వీటిలో కొన్ని తినదగినవి, కొన్ని విషపూరితమైనవి. వీటిలో ఎన్నో పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే పుట్టగొడుగులను ఆహారంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించగలవు, రోగనిరోధక శక్తిని పెంచగలవు. వీటిలో కొన్ని రకాలు ఔషధ గుణాలను కూడా కలిగి ఉన్నాయి. తాజాగా తెలంగాణలో అరుదైన నీలిరంగు పుట్టగొడుగులు వైరల్‌ అవుతున్నాయి.

ఈ పుట్టగొడుగులు విషపూరితమైనవిగా..

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కనకగిరి అడవుల్లో ఇటీవల నీలి రంగు పుట్టగొడుగులు కనిపించడం స్థానిక ప్రజలు, అటవీ అధికారులను ఆశ్చర్యపరిచింది. సాధారణంగా కనిపించని ఈ అరుదైన పుట్టగొడుగులు న్యూజిలాండ్‌కు చెందిన బ్లూ పింక్ గిల్ లేదా స్కై బ్లూ మష్రూమ్ ( ఎంటోలోమా హోచ్‌స్టెట్టెరి) జాతికి చెందినవిగా గుర్తించారు. ఈ జాతి పుట్టగొడుగులు గతంలో కూడా తెలంగాణలో కనిపించాయి. జులై 20న ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో గస్తీ నిర్వహించేటప్పుడు అటవీ అధికారులు ఇలాంటి పుట్టగొడుగులను చూశారు. ఇప్పుడు పెనుబల్లిలోని కనకగిరి అడవుల్లో కూడా వీటిని గుర్తించడంతో ఈ అరుదైన జీవి పరిధి విస్తరిస్తోందని అటవీ అధికారులు చెబుతున్నారు. ఈ పుట్టగొడుగులకి గులాబీ లేదా ఊదా రంగులో మొప్పలు ఉంటాయి. చాలా ఆకర్షణీయమైన నీలి రంగుతో ఇవి ప్రకాశిస్తాయి. ఎంటోలోమా జాతిలోని అనేక పుట్టగొడుగులు విషపూరితమైనవిగా భావిస్తారు. 

ఇది కూడా చదవండి: ముఖంపై మచ్చలు అందాన్ని పాడు చేస్తున్నాయా..? ఈ ఇంటి చిట్కాలతో సమస్యలన్నీ పరార్..!!

అయితే ఈ ప్రత్యేక జాతి పుట్టగొడుగుల గురించి ఇంకా స్పష్టత రాలేదు. కాబట్టి వీటిని ఆహారంగా తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూలుగు ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ (FCRI) లోని ప్రొఫెసర్లు ఈ అరుదైన పుట్టగొడుగుల రంగును ఆహార రంగుగా ఉపయోగించవచ్చో లేదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా ప్రాథమిక రసాయన విశ్లేషణలో కొత్త బయోయాక్టివ్ సమ్మేళనాలు కనుగొన్నారని తెలిపారు. ఈ సమ్మేళనాలు అంటువ్యాధులు, ఆక్సీకరణ ఒత్తిడి వంటి అనేక వ్యాధులకు కొత్త మందులను తయారు చేయడానికి కీలక పాత్ర పోషించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: భాద్రపద అమావాస్య.. పితృదేవతలకు ప్రత్యేక పూజలు, పవిత్ర స్నానాలు ప్రత్యేకత తెలుసుకోండి

Advertisment
తాజా కథనాలు