అఘోరీకి బిగ్ షాక్.. రంగంలోకి తెలంగాణ డీజీపీ!

లేడీ అఘోరీ తీరుపై లాయర్ రాజేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముస్లింలపై అఘోరీ తీవ్ర వ్యాఖ్యలు చేసిందని.. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడిందని తెలంగాణ డీజీపీకి లేఖ రాశారు. మతఘర్షణల్ని ప్రేరేపించేలా మాట్లాడిందని.. అఘోరీని అరెస్ట్‌ చేయాలని ఫిర్యాదు చేశారు.

Lady Aghori
New Update

లేడీ అఘోరీకి బిగ్ షాక్ తగిలింది. ఆమె తీరుపై న్యాయవాదులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు న్యాయవాది రాజేష్‌ తెలంగాణ డీజీపీకి లేఖ రాశారు. ముస్లింలపై అఘోరీ తీవ్ర వ్యాఖ్యలు చేసిందని.. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడిందని న్యాయవాది రాజేష్ ఫిర్యాదు చేశారు. సమాజంలో మతఘర్షణల్ని ప్రేరేపించేలా మాట్లాడిందని.. అఘోరీని వెంటనే అరెస్ట్‌ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Also Read:   ఉచిత సిలిండర్ పొందాలంటే.. ఇవి తప్పనిసరి!

గత కొన్ని రోజుల నుంచి అఘోరీకి సంబంధించిన వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. మొదట తెలంగాణలో అడుగుపెట్టిన అఘోరీ.. పలు ఆలయాలను సందర్శంచింది. ఆ తర్వాత సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ టెంపుల్‌ను కొందరు దుండగులు నాశనం చేయడంతో అక్కడ ప్రత్యక్షమైంది. నగ్నంగా పూజలు చేసి వైరల్‌గా మారింది. ఇక అక్కడ నుంచి ఆమెకు సంబంధించి ఏ చిన్న వార్త అయినా ఇట్టే వైరల్ అయిపోతుంది. 

Also Read: JEE అభ్యర్థులకు అలెర్ట్.. ఈసారి కీలక మార్పులు!

గుడిని ద్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అఘోరీ చెప్పుకొచ్చింది. ఆపై పలు మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడంతో మరింత పాపులర్ అయింది. అంతేకాకుండా సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తానని తెలిపింది. ఇందులో భాగంగానే తాను ముత్యాలమ్మ గుడిలో ఆత్మార్పణం చేసుకుంటానని ప్రకటించింది. 

Also read:  శబరిమల యాత్రికులకు శుభవార్త.. ఉచిత బీమా కవరేజీ 

ఆత్మార్పణం చేసుకుంటా

అక్టోబర్ 31 దివాళి రోజు ఆత్మార్పణం చేసుకుంటానని తెలిపింది. దీంతో ముందుగానే అప్రమత్తమైన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆపై అఘోరీ సొంత ఊరికి తీసుకెళ్లి రెండు రోజులు హౌస్ అరెస్టు చేశారు. అనంతరం మహారాష్ట్ర సరిహద్దులో తెలంగాణ పోలీసులు వదిలేశారు. అక్కడ నుంచి కాశీకి వెళ్లిపోయిన అఘోరీ.. తెలంగాణలో తనకు అవమానం జరిగిందని.. మళ్లీ తిరిగి రానని చెప్పుకొచ్చింది.

Also Read:  కార్తీకంలో ఈ పనులు చేస్తే.. ముల్లోకాల పుణ్యమంతా మీ సొంతం

ఏపీలో ప్రత్యక్షం

ఇక రీసెంట్‌గా మళ్లీ కాశీ నుంచి ఏపీలో ప్రత్యక్షమైంది. ఆత్మకూరులో అఘోరీ కారును కొందరు స్థానికులు గుర్తించారు. ఆపై ఆ కారు చుట్టూ గుమిగూడారు. కానీ అఘోరీ మాత్రం తన కారును ఆపకుండా వెళ్లిపోయింది. కొందరు ఫాలో అయ్యారు కానీ ఆపకుండా శ్రీశైలం రహదారి మీదుగా వెళ్లిపోయింది. 

 

#lady aghori
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe