మనిషి మాంసం తింటా అంటున్న మహిళా అఘోరి.. అసలు చట్టం ఏం చెబుతోంది?

సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ గుడిలో నగ్నంగా కనిపించిన లేడీ అఘోరీ కాలుతున్న శవాన్ని కచ్చితంగా తింటామని చెప్పింది. భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు నరమాంస భక్షకానికి వ్యతిరేకంగా చట్టాలను ఆమోదించాయి. నరమాంసాన్ని తింటూ పట్టుబడితే కఠినంగా శిక్ష పడుతుంది.

lady aghori naga sadhu
New Update

సికింద్రాబాద్ పరిధిలోని మోండా మార్కెట్లో కుమ్మరిగూడలో ముత్యాలమ్మ తల్లి గుడిలో ఆశ్చర్యకర ఘటన జరిగింది. ఆ గుడిలోకి ఓ మహిళా అఘోరీ (నాగసాధు) రావడంతో అక్కడున్న వారంతా భయబ్రాంతులకు గురయ్యారు. ఆమె ఒంటిపై నూలు పోగులేకుండా నగ్నంగా ఉన్న రూపాన్ని చూసి గుడిలో ఉన్న భక్తులంతా ఖంగుతిన్నారు. శరీరం మొత్తం తెల్లటి విభూతిదో కనిపించడంతో సాక్షాత్తు అమ్మవారే వచ్చారని మహిళా అఘోరిపై పసుపు నీళ్లు చళ్లారు. అనంతరం ఆ మహిళా అఘోరీ హోమంలో పాల్గొని ఒంటి కాలిపై నిలబడి పూజాలు చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సైతం నెట్టంట తెగ ట్రెండ్ అవుతోంది. అయితే అఘోరాలు ఏం తిని బతుకుతారు? వారు ఎక్కడ ఉంటారు? అసలు వారు పట్టణ ప్రాంతాల్లో నగ్నంగా తిరగడానికి ఏమైనా చట్టబద్దత ఉందా? లేదా? అనేది పూర్తిగా తెలుసుకుందాం. 

ఇది కూడా చూడండి: సరికొత్త స్కానర్.. వ్యాధుల గుర్తింపు మరింత ఈజీగా..

అఘోరీలు వర్సస్ నాగ సాధువులు

నాగ సాధు నుంచి మహిళా అఘోరిగా మరడానికి కారణాలేంటో తెలిపింది. నాగసాధువులు అంటే తపస్సుతో.. నిత్యం శివయ్య నామస్మరణను కలిగి ఉంటారని చెప్పింది. అదే సమయంలో అఘారీలు తాంత్రిక విద్యలో ఇమిడి ఉంటారని తెలిపింది. తాను తాంత్రిక విద్య నేర్చుకుని సేవ చేసుకునేందుకే అఘోరగా మారానని చెప్పింది.   

శవాలను అందుకే తింటాం

ఇది కూడా చూడండి: ఘోర ప్రమాదం.. టెంపోను బస్సు ఢీకొనడంతో 8 మంది చిన్నారులు మృతి

నరమాంస భక్సకులు కాలుతున్న శవాన్ని కచ్చితంగా తింటారని ఆ మహిళా అఘోరా తెలిపింది. తాంత్రిక విద్య నేర్చుకున్న సమయంలో ఇంకా నేర్చుకోవాలి.. ఇంకా సేవ చేసుకోవాలని.. మంత్ర శుద్దిని కాపాడుకోవాలంటే కాలీమాత, కాల భైరవుడికి స్మశానంలో కాలుతున్న శవాన్ని మంత్రశుద్ది చేసి.. నైవేథ్యంగా అమ్మవారికి అర్పణ చేసి.. ప్రసాదంగా కొద్దిగా కాలుతున్న శవాన్ని తీసుకుంటాం అని అన్నారు. శరీరం మొత్తం తినకుండా, కొద్దిగా ప్రసాదంలా తింటామని తెలిపింది. అయితే మానవ మాంసాన్ని తినడంతో పాటు.. కొంతమంది మృతదేహాలతో లైంగిక సంబంధం కలిగి ఉంటారని, తద్వారా వారు అతీంద్రియ శక్తులను పొందవచ్చని సమాచారం.

ఇది కూడా చూడండి: సరికొత్త స్కానర్.. వ్యాధుల గుర్తింపు మరింత ఈజీగా..

ఎప్పుడు బయటకు వస్తారు

కేవలం కుంభమేళా సమయంలో మాత్రమే పురుష అఘోరాలు, మహిళా అఘోరీలు భయటికి వస్తారని తెలిపింది. కుంభమేళా పుష్కరం లాంటిదని, అప్పుడే బయటకు వస్తామని మిగతా సమయాల్లో బయటకు రామని తెలిపింది.

బట్టలు ఎందుకు వేసుకోరు

తల్లి గర్భం నుంచి వచ్చే క్రమంలో ప్రతి ఒక్కరూ ఎలాంటి దుస్తులు లేకుండా బయటకు వస్తారు. చనిపోయిన తర్వాత కూడా దుస్తులు తీసేస్తారు. అదేకారణంతోనే ఆ మహిళా అఘోరీ కూడా ఎలాంటి దుస్తులు లేకుండా బయటికి వెళ్తానని తెలిపింది. 

ప్రతి అఘోరీ వద్ద మగ పుర్రె

ఇది కూడా చూడండి: ఐదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు గ్యాంగ్ రేప్! 

అఘోరాలు ఎప్పుడూ రహస్యంగానే ఉంటారు. శ్మశానవాటిక, మృతదేహం, శివుడితో ప్రత్యేకమైన అనుబంధం వారికి ఉంటుంది. ప్రతి అఘోరీ ఖచ్చితంగా తమ వద్ద ఒక మగ పుర్రెను ఉంచుకుంటారు. దాంట్లోనే తింటారు, తాగుతారు. అయితే పుర్రెలోనే ఎందుకు తినడం అనే సందేహం రావచ్చు. దానికీ ఓ కారణం ఉంది. పుర్రె శివుడిని సూచిస్తుందని వారు నమ్ముతారు. దీన్ని మోయడం వల్ల శుభం కలుగుతుందని వారిలో నమ్మకం. అందువల్లనే దానిలోనే అన్నీ చేస్తారు. 

చట్టం ఏం చెబుతోంది?

నరమాంస భక్షకత్వాన్ని ఆంత్రోపోఫాగి అని కూడా అంటారు. ఏకాభిప్రాయం ఉన్నా లేకున్నా మరొక మానవుడి మాంసాన్ని లేదా అవయవాలను తినడం అఘోరాలు ఆచారంగా భావిస్తుంటారు. ఈ చర్య చాలా కాలంగా కొనసాగుతుంది. అయితే విషయం ఏంటంటే.. భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు నరమాంస భక్షకానికి వ్యతిరేకంగా చట్టాలను ఆమోదించాయి. నరమాంసాన్ని తింటూ పట్టుబడితే కఠినంగా శిక్ష పడుతుంది. నరమాంస భక్షకానికి సంబంధించిన ప్రముఖంగా నివేదించబడిన కేసుల్లో చాలా వరకు హత్యకు సంబంధించిన ఆరోపణలతో పాటు జీవిత ఖైదుకు దారితీసింది. 

#viral-news #latest-viral-news #lady-aghori
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe