Aghori: అఘోరీ సంచలన నిర్ణయం.. నన్ను అవమానించారు, ఇక చూస్కోండి!

అఘోరీ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో తనను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మళ్లీ తెలంగాణకు రానంటూ పేర్కొంది. కాగా తాను ఆత్మార్పణం చేసుకుంటానన్న ప్రకటనతో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. రీసెంట్‌గా అఘోరీని మహారాష్ట్ర సరిహద్దుల్లో వదిలిపెట్టారు.

New Update

అఘోరీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో తనను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇకపై మళ్లీ తెలంగాణకు రానని అఘోరీ తెలిపింది. ప్రస్తుతం ఆమె కాశీకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే చెప్పిన మాట ప్రకారం మళ్లీ తిరిగి రాకుండా ఉంటుందా? లేక మరేదైన కారణంతో తెలంగాణ బాట పడుతుందా? అని కొందరు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా గత నెల రోజులుగా అఘోరీ తెలంగాణలో సంచలనం సృష్టించిందనే చెప్పాలి. 

ఇది కూడా చూడండి:  ఉచిత సిలిండర్ పొందాలంటే.. ఇవి తప్పనిసరి!

ముఖ్యంగా తెలంగాణలో అడుగుపెట్టిన లేడీ అఘోరీ మొదట కొన్ని ఆలయాలను సందర్శించింది. కానీ అంతలా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయంలో నగ్నంగా పూజలు చేయడంతో వైరల్‌గా మారిపోయింది. దీంతో ఆమె పలు ఇంటర్వ్యూలు ఇచ్చి ఇంకాస్త ట్రెండింగ్‌లోకి వచ్చింది. 

ఇది కూడా చూడండి: JEE అభ్యర్థులకు అలెర్ట్.. ఈసారి కీలక మార్పులు!

ఆ ఇంటర్వ్యూలలో ఆమె చెప్పిన విషయాలకు నెటిజన్లు షాక్ అయ్యారు. శవాలను తింటామని చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఇక అప్పటి నుంచి ఆమెకు సంబంధించి ఏ చిన్న వార్త అయినా ఇట్టే వైరల్ అయింది. ఆ తర్వాత సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పుకొచ్చింది. ఇందులో భాగంగానే తాను ఆత్మార్పణ చేసుకుంటానని ప్రకటించింది. 

ఇది కూడా చూడండి:  శబరిమల యాత్రికులకు శుభవార్త.. ఉచిత బీమా కవరేజీ 

ఆత్మార్పణం చేసుకుంటా

అందులో తాను చనిపోతే శివయ్య వద్దకు వెళ్లిపోతానని.. బతికుంటే సనాతన ధర్మాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని తెలిపింది. ఇక ఆమె ఆత్మార్పణ చేసుకుంటానని చెప్పడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు.

ఇది కూడా చూడండి: కార్తీకంలో ఈ పనులు చేస్తే.. ముల్లోకాల పుణ్యమంతా మీ సొంతం

ఈ మేరకు హైదరాబాద్‌కు వెళ్తుండగా అర్ధరాత్రి సిద్ధిపేటలో అఘోరీని అదుపులోకి తీసుకుని తన స్వగ్రామమైన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుషన్‌పల్లికి తీసుకెళ్లారు. అక్కడ తన తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. అక్కడ రెండు రోజుల పాటు అఘోరీని హౌస్ అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు ఆపై రీసెంట్‌గా మహారాష్ట్ర సరిహద్దుల్లో వదిలిపెట్టారు. ఇక అక్కడ నుంచి అఘోరీ కాశీకి వెళ్లిపోయింది.

 

#aghori
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe