Lady Aghori : వేములవాడకు లేడీ అఘోరీ...దర్గాను కూల్చివేస్తానంటూ..

గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరీ హల్ చల్ చేస్తోంది. తాజాగా వేములవాడ రాజన్న ఆలయానికి వెళ్లేందుకు రెడీ అయింది. అఘోరీ వస్తుందనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సనాతన ధర్మాన్ని కాపాడుతానంటూ ఆమె చేస్తున్న రచ్చ అనేక వివాదాలకు తావిస్తోంది

New Update
Lady Aghori Naga Sadhu Hulchul in Tanuku

Lady Aghori Naga Sadhu Hulchul in vemulawada

 Lady Aghori : గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరీ హల్ చల్ చేస్తోంది. తాజాగా వేములవాడలోని రాజన్న ఆలయానికి వెళ్లేందుకు రెడీ అయింది. లేడీ అఘోరీ వస్తుందనే సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. లేడీ అఘోరీ రెండు రాష్ట్రల్లోని దేవాలయాలను సందర్శిస్తూ హంగామా సృష్టిస్తోంది. సనాతన ధర్మాన్ని కాపాడుతానంటూ చేస్తున్న రచ్చ అనేక వివాదాలకు తావిస్తోంది. పలు దేవాలయాల్లో ఆమె రాకను అడ్డుకోవలసిన పరిస్థితి ఏర్పాడుతోంది. మరోవైపు లేడీ అఘెరీ ఎక్కడ అడుగుపెడితే అక్కడ వివాదాలకు తెరతీయడం, పోలీసులను ఇష్ఠరీతిన తిట్టడం వంటి చర్యలతో శాంతి భద్రతల సమస్యకు కారణమవుతోంది.

Also Read:  Actress Ranya Rao:గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్ ట్విస్ట్...రన్యారావు వెనుక ప్రముఖులు., పెళ్లి వీడియో పై సీబీఐ కన్ను!

Also Read: రెచ్చిపోయిన పోలీసులు.. రచ్చ చేశారంటూ యువతకు గుండ్లు కొట్టించి ఊరేగింపు

ఈ క్రమంలోనే వేములవాడలోని రాజన్న ఆలయానికి వెళ్లేందుకు రెడీ అయింది. లేడీ అఘోరీ వస్తుందనే సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆమెను జిల్లా సరిహద్దుల్లోనే ఆపేయాలని పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశించారు. దాంతో పోలీసులు జిల్లెళ్ల చెక్ పోస్టు వద్ద భారీగా మోహరించారు. ఆమెను ఆలయం వద్దకు వెళ్లనీయకుండా జాగ్రత్త పడుతున్నారు. కానీ లేడీ అఘోరీ మాత్రం అస్సలు వినిపించుకోవట్లేదు. తాను రాజన్న దర్శనం చేసుకుని తీరుతానని.. సనాతన ధర్మాన్ని కాపాడుతానంటూ నానా రకాల వ్యాఖ్యలు చేస్తోంది. 

Also Read: హైజాక్ నుంచి 104మందిని రక్షించిన పాక్ ఆర్మీ..16 మంది ఉగ్రవాదులు హతం

కాగా గతంలో రాజన్య ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజన్న ఆలయంలోని దర్గాను తొలగిస్తానంటూ గతంలో సంచలన వీడియోలు విడుదల చేసింది. దీంతో ఇప్పుడు అందుకోసమే వస్తుందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆమెను ఆలయం వద్దకు రాకుండా అడ్డుకుంటున్నారు. లేడీ అఘోరీ రాకతో సున్నితమైన అంశాలు వివాదాస్పదం అవుతాయేమో అని పోలీసులు భావిస్తున్నారు. ఈ నడుమ ఆలయంలోని దర్గా మీద కొన్ని హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇలాంటి సమయంలో లేడీ అఘోరీని సిరిసిల్ల జిల్లాలో అడుగు పెట్టనీయకపోవడమే మంచిదన్న ఆలోచనలో పోలీసులు ఉన్నారు.

ఇది కూడా చదవండి: Manchu Mohan Babu : సౌందర్యది హత్యే! చంపింది మోహన్ బాబే.. మంచు మోహన్‌ బాబుపై సంచలన ఫిర్యాదు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు