Kyathanapalli  :  క్యాతనపల్లిలో హైటెన్షన్‌..మంత్రి వివేక్‌ వాహనంపై రాళ్లదాడి

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మంత్రి వివేక్ వాహనంపై బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేయడంతో వాహనం స్వల్పంగా ధ్వంసమైంది.

New Update
FotoJet (13)

Kyathanapalli  

Kyathanapalli : మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. నిన్న వాయిదా పడిన ఎంపిక నేడు తిరిగి సమావేశం ఏర్పాటు చేయగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ రోజు చైర్మన్‌ ను ఎన్నుకోవడం కోసం అన్ని పార్టీలకు చెందిన కౌన్సిలర్లు క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ముందుగా బీఆర్ఎస్, సీపీఐ అభ్యర్థులు భారీ బందోబస్తుతో చేరుకున్నారు. కాంగ్రెస్‌ సభ్యులు ఎంపీ వంశీకృష్ణ, మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి వచ్చారు. ఈ సందర్భంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త ముదరడంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడికి మంత్రి క్యాన్వయ్‌ చేరుకోవడంతో బీఆర్‌ఎస్‌ నాయకులు వాహనంపై రాళ్లతో దాడి చేశారు. దీంతో వాహనం ద్వంసమైంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ చార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కాగా నిన్న జరిగిన ఘటనల నేపథ్యంలో క్యాతనపల్లిలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.  కాగా, పోలీసులను అడ్డం పెట్టుకుని మరోసారి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పీఠం దక్కించుకునేందుకు కుట్రలు చేస్తుందని బీఆర్‌ఎస్ ఆరోపిస్తుంది.  చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎన్నికలో పాల్గొనేందుకు వెళ్తున్న క్యాతనపల్లి మున్సిపాలిటీ 21వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ స్వర్ణలతను మంగళవారం పోలీసులు అడ్డుకున్నట్లు తెలిసింది. ఆమెపై కేసు నమోదైందని ఆమెను అదుపులోకి తీసుకోవడం కలకలం సృష్టించింది.  దీనిపై ఎమ్మెల్యే కోవా లక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్రంగా ఆక్షేపించారు. దీంతో బాల్క సుమన్ మీద కొంతమంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు. దీంతో బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రతిఘటించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ చార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు